Hari Hara Veera Mallu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revantha Reddy) తన నిర్ణయం మార్చుకుంటారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కోసం తను చేసిన ప్రతిజ్ఞను పక్కన పెడతారా? ఏమో, ఆ విషయం తెలియాలంటే జూన్ 12 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఏం నిర్ణయం, ఏం ప్రతిజ్ఞ? అని అనుకుంటున్నారా? ఇంకెం నిర్ణయం.. సినిమా టికెట్ల ధరల నిర్ణయం. అవును, ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ప్రీమియర్ టైమ్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరల పెంపును సీఎం రేవంత్ రెడ్డి బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా అనుమతి లేదంటూ హుకుం జారీ చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమా వచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో నార్మల్ ధరలకే ప్రదర్శితమవుతున్నాయి. నిర్మాతలెవరూ తమ సినిమాల టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు నిమిత్తం ప్రభుత్వాన్ని సంప్రదించలేదు.
Also Read- Kannappa Hard Disk: మనోజ్ ఇంట్లో పనిచేసే వారి పనే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఎలాంటి సినిమా అయినా సరే, టికెట్ల ధరలు పెంచుకుంటామంటే చాలు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ఆఫ్‌కోర్స్ ప్రస్తుత పరిస్థితులు అక్కడ కూడా కాస్త కఠినతరం చేశారనుకోండి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇకపై తనని సంప్రదించవద్దంటూ, ఏదైనా ఛాంబర్ ద్వారానే వచ్చి అడగాలని, సినిమాకు సంబంధించిన వారు వస్తే పని జరగదని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో యూనిటీని పెంపొందించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా ఛాంబర్ నుంచి ఇంత వరకు ఎలాంటి కదలిక లేదు. పవన్ కళ్యాణ్ పిలుపు వారంతా లైట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ఈ విషయమై ఓ కమిటీ వేసినట్లుగా కూడా టాక్ తెలుస్తుంది. అసలు విషయం ఏమిటనేది తెలియాల్సి ఉంది.
Also Read- Naa Anveshana: ఆ ప్రశ్న ఒక్కటి చాలు.. భయ్యా సన్నీ యాదవ్ బొక్కలన్నీ బయటపడతాయ్!
ఇదిలా ఉంటే, తెలంగాణ టికెట్ల ధర పెంపె సంస్కృతిని మళ్లీ పవన్ కళ్యాణ్ తీసుకురాబోతుందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈ విషయమై నిర్మాత ఏ.ఎం రత్నం శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయం స్వయంగా ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. ‘‘17వ శతాబ్దానికి సంబంధించిన కథతో భారీ స్థాయిలో రూపొందిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాను. తెలంగాణలోని సినిమా టికెట్ల ధరల ప్రస్తావన తీసుకు రావడం జరిగింది. తన విలువైన సమయాన్ని కేటాయించి, సినిమా గురించి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ నిర్మాత తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మరి ఈ భేటీ తర్వాత సీఎం తన నిర్ణయం మార్చుకుంటారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకు టికెట్ల ధరల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారా? లేదంటే, ఈ సినిమాకు ఇస్తే.. మళ్లీ అందరూ తమ చుట్టూ చేరతారని లైట్ తీసుకుంటారా? అనేది మాత్రం చూడాల్సి ఉంది. క్రిష్, జ్యోతికృష్ణల దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ‘హరి హర వీర మల్లు’ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
Today, I had the honour of meeting Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu to discuss our film #HariHaraVeeraMallu. This project is a passion-driven historical epic set in the 17th century during the Mughal period, depicting the Battle of Dharma. It is made on a grand… pic.twitter.com/LskevdQp5g
— AM Rathnam (@AMRathnamOfl) May 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు