fire accident fire smoke
క్రైమ్

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

– ఫార్మా యూనిట్‌లో చెలరేగిన మంటలు
– కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కార్మికులు
– వెల్డింగ్ రవ్వలు పడటమే కారణమని నిర్ధారణ
– బాలుడి చొరవతో బయటపడ్డ 50 మంది కార్మికులు

రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెర్బల్‌ కంపెనీలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు అంటుకొని క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. ఈ కంపెనీలో 300 మంది పనిచేస్తుండగా, ప్రమాద సమయంలో కంపెనీలో 50 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పలువురు కార్మికులు కిటీకీల్లోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే, ఇంకా పలువురు కార్మికులు పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నిచ్చెనల సాయంతో కార్మికులకు కిందకు తీసుకువచ్చారు. మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. అందరినీ సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు భవనం నుంచి వ్యక్తులకు గాయాలు కాగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరి పరిస్థితిని సమీక్షించారు. మంటల ధాటికి స్వల్ప గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

Also Read: సెంటి‘మంటల్’ పాలిటిక్స్

కాగా అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్‌.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్‌ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!