Rajiv Yuva Vikas Scheme: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న రాజీవ్ యువ వికాసానికి ప్రతి నెల రూ. 1500 కోట్లు చొప్పున బడ్జెట్ రిలీజ్ చేయాలని ఆర్ధిక శాఖ భావిస్తుంది. ఈ మేరకు బడ్జెట్ కోసం ప్రత్యేక ప్లాన్ చేస్తుంది. అక్టోబరు 2 వరకు విడతల వారీగా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. ఇప్పటికే రూ.50 వేలు, లక్ష యూనిట్లకు తొలుత అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2న ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వనున్నారు. జూన్ 10 నుంచి 15 వరకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లపై నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు అమలుచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.
జూన్15 తర్వాత ఆయా స్కీమ్ లను గ్రౌండింగ్ చేయనున్నారు. ప్రభుత్వం యువతకు మేలు చేసేందుకు ఈ స్కీమ్ ను ఎంపిక చేసినట్లు చెప్తున్నది. కానీ దీని గ్రౌండింగ్ ఫర్ ఫెక్ట్ గా లేకపోతే దళిత బంధు తరహాలోనే విమర్శలు పాలు కావాల్సి వస్తుందని స్వయంగా ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. ఈ స్కీమ్ పై ప్రభుత్వం ఎలా మానిటరింగ్ చేస్తుందనేది అధికారుల్లోనూ చర్చంశనీయమైంది. సీఎం, డిప్యూటీ సీఎం ఈ స్కీమ్ ను సమర్ధవంతంగా పంపిణీ చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితులు సక్రమంగా లేకపోతే సర్కారే నష్టపోవాల్సి వస్తుందని ఓ కీలక అధికారి చెప్పుకొచ్చారు.
Also Read:Flexies At Kavitha Home: కవిత ఇంటి ముందు ఆసక్తికర ఫ్లెక్సీలు.. ఆందోళనలో బీఆర్ఎస్!
ఎంపికపై ఆందోళన..?
ఈ స్కీమ్ కొరకు అప్లై చేసిన అభ్యర్ధుల్లో మాత్రం గందరగోళం నెలకొన్నది. లక్ష లోపు ఎంత మందికి ఇస్తారు? తమకు వస్తుందా? లేదా? లక్ష స్లాబ్ పూర్తయిన తర్వాత మిగతా వారికి అందజేస్తారా? గత ప్రభుత్వం తరహాలోనే చేతులు ఎత్తేస్తారా? అనే అనుమానాలు పబ్లిక్ లో నెల కొన్నాయి. మరోవైపు అభ్యర్ధులను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లీడర్లే ఎంపిక చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో తమకు రానే రాదని కొందరు మదన పడాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. నిబంధనలు ప్రకారం ఎంపీడీవోలు క్యాండియేట్లను సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
కానీ మెజార్టీ జిల్లాల్లో స్థానిక అధికార పార్టీ లీడర్లు లిస్టు తయారు చేసి అధికారులకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పలువురు అభ్యర్ధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దళిత బంధు సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండేది. స్కీమ్ ఎంపికను ప్రజాప్రతినిధులు చేశారు. దీంతో ఇష్టమైనోళ్లకు యూనిట్లు అందజేశారనే ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి. పైగా కొందరు ఎమ్మెల్యేలు,వాళ్ల అనుచరులు కమీషన్లు తీసుకున్నారనే ప్రచారం కూడా గత ప్రభుత్వంలో జరిగింది. ఇది 2023 ఎన్నికల సమయంలో కీలక ప్రభావం చూపినట్లు స్వయంగా బీఆర్ ఎస్ నాయకులే చెప్పారు. ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలోనూ కాంగ్రెస్ అదే తప్పు చేస్తున్నది. ఇది ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుందని ఒరిజినల్ కాంగ్రెస్ (మొదట్నుంచి పార్టీలోనే ఉన్నోళ్లు) నాయకులు చెప్తున్నారు.
Also Read: GHMC – Entomology Service: దోమల నివారణ కోసం.. ఎంటమాలజీ సేవలు అమలు!
మంచి అవకాశం…?
స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న వారికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ సంపూర్ణంగా గ్రౌండింగ్ అయితే సుమారు 5 లక్షల మంది వ్యాపార వేత్తలు తయారవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు మేలు జరుగుతుంది. వాస్తవానికి చాలా మంది యువతకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, సరైన ఆర్ధిక సాయం, పెట్టుబడి లేకపోవడంతో వెనకడుగు వేస్తుంటారు. కానీ ఈ స్కీమ్ యూత్ కు అండగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ కొరకు ఏకంగా 16.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ స్కీమ్ సక్సె స్ అయితే దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోన్నది. తద్వారా వెనుకబడిన తరుగతుల సామాజిక-ఆర్థిక స్థితిగతులను సమూలంగా మారడమే కాకుండా,రాష్ట్ర జీఎస్‌డీపీ మెరుగవడానికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ స్కీమ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలకు చెందిన వారు 80 శాతం మంది లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.
గతంలో 9.09 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్
గతంలో వివిధ కార్పొరేషన్ల కింద ఆర్థిక సాయం కోసం వచ్చిన 9.09 లక్షల దరఖాస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం పెడింగ్‌లో పెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీని వల్లే తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధి పొందేందుకు 16.22 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే తమ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిన అనధికాలంలోనే 5 లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నట్టు పేర్కొన్నారు.
అయితే దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు ఐదేళ్లపాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్‌తో పరిశీలించి, సరైన ఖాతాలు ఇచ్చారా, లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Also Read: Bhatti Vikramarka Mallu: ఆదివాసి, నిరుపేదల సంక్షేమమే.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !