Flexies At Kavitha Home (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Flexies At Kavitha Home: కవిత ఇంటి ముందు ఆసక్తికర ఫ్లెక్సీలు.. ఆందోళనలో బీఆర్ఎస్!

Flexies At Kavitha Home: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు లేఖ రాసి.. అందరికీ ఆమె షాకిచ్చారు. ఆపై తన తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మరవకముందే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగిందంటూ మరో బాంబ్ పేల్చారు. రోజుకో అంశంపై బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతున్న కవిత.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆఫీసును ఏర్పాటు చేసుకున్నారు.

ఇంటి పక్కనే.. కొత్త ఆఫీసు
ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బంజారాహిల్స్ లోని తన నివాసం పక్కన తెలంగాణ జాగృతి పేరుతో కొత్త కార్యాలయాన్ని సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే తన భర్త అనిల్ కుమార్ తో కలిసి జాగృతి కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడే అవకాశముంది.

ప్రత్యేక ఆకర్షణగా విగ్రహాలు
కవిత కొత్త ఆఫీసులోని దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్యాలయంలో భారీ కేసీఆర్ ఫోటోతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue).. బాబా సాహెబ్ అంబేద్కర్ (B. R. Ambedkar).. మహాత్మ జ్యోతిబాపూలే (Jyotirao Phule).. సావిత్రిబాయి పూలే (Savitribai Phule).. ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar)ల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. కార్యాలయంలో కేసీఆర్ ఫొటో (KCR Photo) మినహా ఇతర నేతల (కేటీఆర్, హరీష్ రావు) ఫోటోలు ఏవి లేకపోవడం చర్చకు తావిస్తోంది. అంతేకాదు తెలంగాణ జాగృతి పేరుకు ఇరు వైపులా తెలంగాణ తల్లి విగ్రహం.. అమరవీరుల స్తూపం.. ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

ఆసక్తికరంగా ఫ్లెక్సీలు
జాగృతి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆసక్తికరంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గులాబీ రంగు జెండాల బ్యాక్ గ్రౌండ్ తో దర్శనమిస్తున్నాయి. ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అనే కొటేషన్ ఫ్లెక్సీపై రాయడం ఆసక్తిరేపుతోంది. బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కండువాలో కవిత ఉ కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.

కవిత కొత్తపార్టీ పేరు అదేనా?
కవిత కొత్త పార్టీ పెట్టే విషయమై కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. పార్టీకి టీబీఆర్ఎస్ అని నామకరణం చేసే అవకాశమున్నట్లు సమాచారం. అయితే కవిత కొత్త పార్టీ పెట్టడానికి కేటీఆర్ తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాం ఆరోపణలతో కవిత జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు పార్టీ అనుమతి ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఆమె పర్యటిస్తే పార్టీకి డ్యామేజ్ అవుతుందని, కట్టడి చేయాలని భావించినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమెకు కేటీఆర్ కు మధ్య గ్యాప్ వచ్చిందని, అంతేగాకుండా ఆమెకు పార్టీ కూడా ఆశించిన స్థాయిలో సపోర్టు చేయడం లేదని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ