Narayana Murthy: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. టాలీవుడ్ విప్లవ చిత్రాల నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తిని (R. Narayana Murthy) పెద్దల సభకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఒకట్రెండు పార్టీల నుంచి ప్రపోజల్స్ కూడా నడుస్తున్నాయి. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు అయితే ‘ఇలాంటి వ్యక్తిని రాజ్యసభకు (Rajya Sabha) పంపు మహాప్రభో’ ఎవర్ని పడితే వాళ్లను పంపితే ఇదిగో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్లారా చూశారు కదా? అని సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏ పార్టీ తరఫున రాజ్యసభకు నారాయణ మూర్తి వెళ్లే అవకాశాలు ఉన్నాయి? ఏ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ రేంజిలో డిమాండ్ చేస్తున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!
ఎవరీ పీపుల్స్ స్టార్..?
ఆర్. నారాయణ మూర్తిని తెలుగు ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఆయన నటించిన, నిర్మించే, డైరెక్ట్ చేసే సినిమాలను చూస్తే మూర్తిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విప్లవ భావాలు, సెంటిమెంట్ సినిమాలకు ఆయన పెట్టిన పేరు. అలా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన నిలబడుతూ, సినిమాల ద్వారా సందేశాన్ని ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఈయన్ను ఎక్కువగా ప్రజా నాట్య మండలి హీరో అని ఇండస్ట్రీలో, బయట అభిమానులు పిలుస్తుంటారు. చిన్నప్పట్నుంచి విప్లవ భావాలు ఉండేవి. విద్యార్థి సంఘం నేతగా, లలిత కళల విభాగానికి కార్యదర్శిగా, రిక్షా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో నానా తిప్పలు పడ్డారు కూడా. అలా సినిమాపై పిచ్చితో మద్రాసుకు వెళ్లి తిండి, తిప్పలు లేక కెరీర్ ప్రారంభానికి ముందే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలా కెరీర్ ప్రారంభించి, నేడు ఈ స్థాయికి ఎదిగారు. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ముక్కు సూటి మనిషి. ఎవరినైనా సరే ఫలానా తప్పు అంటే తప్పే అని వాళ్ల ముందే చెప్పే ధైర్యమున్న వ్యక్తి. స్జేజీ పైన అయినా, మీడియా ఎదుట ఇలా ఎక్కడైనా సరే తాను చెప్పాలనుకున్నది.. రాజకీయంగా కానీ, సినిమా పరంగా కానీ చెప్పేస్తుంటారు. ఎవరి నుంచి ఎన్నెన్ని విమర్శలు వచ్చినా సరే డోంట్ కేర్. తనకు నచ్చిందంటే చాలు.. అవతలి వాళ్లకు నచ్చినా నచ్చకున్నా సరే.. భేష్ అని చెప్పేస్తుంటారు.
Read Also- Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై.. రంగంలోకి మేడమ్!
నాటి నుంచి నేటి వరకూ..!
వాస్తవానికి రాజకీయాలకు మూర్తికి ఎలాంటి సంబంధం లేదు కానీ, ఈయన్ను ఎంపీగా, ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి పంపాలని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆ మధ్య గట్టిగానే ప్రయత్నాలు చేశాయని చెబుతుంటారు. అప్పట్లో టీడీపీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా, రాజకీయాల్లోకి వచ్చే, ఆ ఆఫర్లను సున్నితంగానే తిరస్కరించారు. అయితే వైఎస్ హయాం నుంచి అప్పుడప్పుడు ఈయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, వామపక్షాల ధర్నాలకు మద్దతివ్వడం ఇలాంటివి చేస్తూ వస్తున్నారు. వైసీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇంగ్లీష్ మాద్యమం గురించి ఎన్నోసార్లు మాట్లాడారు. జగన్‌ను పలు విషయాల్లో మెచ్చుకున్నారు కూడా. అప్పట్నుంచి ఈయన్ను వైసీపీ మనిషిగా ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు, వైసీపీ ప్రత్యర్థులు ముద్ర వేసేశారు. దీనికి తోడు వైఎస్ జగన్‌ను కూడా అప్పట్లో కలవడం వివాదానికి దారి తీసింది కూడా. అయితే కూటమి ప్రభుత్వంలో ఇంగ్లీష్ మాద్యమాన్ని తీసేశారని విమర్శలు గుప్పిస్తూ కూడా ఈ మధ్యనే సభలో విమర్శలు కూడా గుప్పించారు. ఇంగ్లీష్ ఉంటేనే మంచిది, తద్వారా విద్యార్థులకు మంచి జరుగుతుందని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ఎలాంటి బెరుకు లేకుండా థియేటర్ల విషయంలో మాట్లాడారు. దీంతో ఆయన డేరింగ్ డాషింగ్‌ను కొందరు మెచ్చుకుంటూ ఉండగా.. జనసేన, మెగాభిమానులు, ఇండస్ట్రీలోని పలువురి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రానున్న ఎన్నికల్లో పక్కా..!
మేధావి, విప్లవకారుడు, ప్రజలతో మమేకం అయ్యే మనిషి. ఎలాంటి పని చెప్పినా చేసి, తన మార్క్ నిరూపించుకునే నారాయణ మూర్తి లాంటి వారిని రాజ్యసభకు పంపితే బాగుంటుందని ఈ మధ్య వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే నమ్మకస్తుడు, ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడే వ్యక్తి, నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మనిషి కావడంతో ఇలాంటి వారిని పార్టీ తరఫున పెద్దల సభకు పంపిస్తే అలుపెరగని పోరాటం చేస్తారని, ఇప్పటి వరకూ రీల్ లైఫ్‌లో ‘పీపుల్స్ స్టార్’గా (Peoples Star) ఉన్న నారాయణ మూర్తి.. పదవులు ఉంటే రియల్ లైఫ్ ‘పీపుల్స్ స్టార్’ చూడొచ్చని వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు అధినేతకు సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభకు నామినేట్ చేయడానికి అవకాశం లేకపోవడంతో రానున్న రోజుల్లో తప్పకుండా నారాయణ మూర్తిని తప్పకుండా పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ అత్యంత నమ్మకస్తులు, రైట్ హ్యాండ్‌గా, నీడలా, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేతలంతా పార్టీలు మారడం, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకే మూర్తి లాంటి వాళ్లు విశ్వాసంగా, నీతిగా, నిజాయితీగా ఉంటారని వైసీపీ కార్యకర్తలు గట్టిగానే నమ్ముతున్నారు. 2029 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవర్ని పెద్దల సభకు పంపాలి? ఎలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకోవాలి? అనే విషయాలు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకు అడుగు వేయాలని అధినేతను కార్యకర్తలు కోరుతున్నారు. మరి జగన్ మనసులో ఏముంది? నారాయణ మూర్తికి పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టం ఉందా? లేదా? అసలు రాజకీయాలు అంటే ఒప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి మరి.
Read Also- Nara Lokesh: విద్యాశాఖలో ఇన్ని తప్పులా.. మంత్రి లోకేష్‌కు ఏమైంది!?
ఇలాంటివారిని అసెంబ్లీ కి గానీ పార్లమెంట్ కు గానీ పంపాలి
రాగద్వేషాలకు అతీతంగా
ప్రజల తరఫున ఎదుటి ఎవరున్నా సరే భయపడకుండా పోరాడుతాడు
భార్యాపిల్లలు లేరు అంత సంపాదించినా సొంత ఇల్లు కారు లేదు సంపాదించి దాచుకోవాలనే ఆశ లేదు
పవన్ తప్పు చేసాడని మాట్లాడాడు అదే పవన్ మంచి చేస్తే నెత్తిన… pic.twitter.com/nwKHRfC2aV— Kumar Reddy.Avula (@Kumar991957) June 1, 2025