GHMC(IMAGE credit: twitter)
హైదరాబాద్

GHMC Employees: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు .. అందని ద్రాక్షగా పదోన్నతులు!

GHMC Employees:  గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అభివృద్దితో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో అర్హులైన ఉద్యోగులకు సైతం పదోన్నతులు అందని ద్రాక్షగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషనర్ ఎవరున్నా, నాలుగో తరగతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించటంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేవు. జీహెచ్ఎంసీలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో ప్రతి నెల పదుల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణలు పొందుతూ నిరాశతోనే ఇంటి ముఖం పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో నాలుగో తరగతికి చెంది, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారు సమారు పది శాతం మంది అంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది వరకున్నట్లు సమాచారం. వీరిలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్ల నుంచి సూపరింటెండెంట్ గా, సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం పదోన్నతులకు అర్హత కల్గిన 60 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు కేవలం ఆర్డర్లు ఇచ్చారే తప్పా, వారికి తగిన పోస్టింగ్ గానీ, వేతనం గానీ వర్తింపజేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు. పదోన్నతుల కోసం ఎదురుచూస్తునే వందలాది మంది ఉద్యోగులు రిటైర్డు అయి వెళ్లిపోయినట్లు ఉద్యోగులు వాపోయారు.

Also Read:Harish Rao on TPCC: దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు.. పీసీసీ ఛీఫ్‌పై హరీష్ రావు ఫైర్!

వినతులన్నీ బుట్టదాఖలేనా?
అర్హులైన ఉద్యోగుల పదోన్నతుల కోసం ఇప్పటి వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున అధ్యక్ష, కార్యదర్శులు టి. కృష్ణ, జి. రాజేశ్వరరావు, ఐఎన్టీయూసీ గుర్తింపు పొందిన మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ లు లోకేశ్ కుమార్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి వరుసగా వినతులు సమర్పించినా, ఇప్పటి వరకు వారి వినతులు ఫలించనే లేదు. కొద్ది రోజుల ముందు కమిషనర్ గా వ్యవహారించిన ఇలంబర్తి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయటంతో పదోన్నతులకు అర్హత కల్గిన ఉద్యోగుల జాబితాను అడ్మిన్ విభాగం సిద్దం చేసినట్లు తెలిసింది.

కానీ అప్పటి నుంచి కమిషనర్ ఆమోదం వరకు ఆ జాబితా పెండింగ్ లో ఉండగా, నెల రోజుల క్రితం ఈ లిస్టును స్టేట్ విజిలెన్స్ కు విచారణ నిమిత్తం పంపినట్లు తెలిసింది. విజిలెన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చినా, అధికారులు తాజాగా మరో కొర్రీ పెట్టేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. తాజాగా అర్హులైన ఉద్యోగుల్లో ఎవరెవరికి పదోన్నతులు కల్పించాలన్న విషయాన్ని తేల్చేందుకు అధికారులు ఓ కమిటీని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అదనపు కమిషనర్ (అడ్మిన్), అదనపు కమిషనర్ (ఫైనాన్స్), అదనపు కమిషనర్ (హెల్త్)లతో కారుణ్య నియామకాల విషయాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించారు. ఇదే కమిటీకి పదోన్నతుల వ్యవహారాన్ని పరిశీలనకు అప్పగించాలని భావించిన అధికారులు ఇపుడు కొత్తగా కమిటీ వేస్తామని చెబుతూ, పదోన్నతులను అడ్డుకునేందుకు కమిటీ నియామకం అంటూ కథలు చెబుతున్నారని పలు యూనియన్లు విమర్శిస్తున్నాయి.

ఇతర విభాగాలదే హవా
జీహెచ్ఎంసీలో ప్రతి నెల రిటైర్డు అవుతున్న ఉద్యోగులతో ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్న ఉద్యోగులపైనే పని భారాన్ని పెంచుతున్న అధికారులు ఇతర విభాగాలకు చెందిన వారు కావటంతోనే వారి హవానే కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీలోకి చాలా మంది అధికారులు డీటీసీపీ, సీడీఎంఏ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు డిప్యూటేషన్లపై వస్తుంటారు. వీరిలో చాలా మంది డిప్యూటేషన్ గడువు ముగిసినా, సీట్లను వదలని వారు సైతం ఉన్నారు. ఇలాంటి అధికారులే కార్పొరేషన్ కు చెందిన ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా కమిషనర్ ను తప్పుదోవ పట్టిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇతర విభాగాల హవా కొనసాగుతున్నందున చాలా మంది కార్పొరేషన్ ఉద్యోగులు జాయినింగ్ నుంచి రిటైర్డు వరకు ఒకే పోస్టులో కొనసాగి, చివరకు పదోన్నతులపై ఆశలు వదులుకుని రిటైర్డు అయిన వారు సైతం ఉన్నారు. గతంలో కిషన్ జీ అనే అటెండర్ తాను అటెండర్ గా చేరి, చివరకు అటెండర్ గానే రిటైర్డు అయినట్లు సమాచారం.

Also Read: Damodar Rajanarsimha: స్టైఫండ్ సమస్య సృష్టిస్తున్న.. కాలేజీలపై యాక్షన్ తీసుకోవాలి!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..