Drugs Seized9 image credit: swetcha reporter)
హైదరాబాద్

Drugs Seized: డ్రగ్​ పెడ్లర్ల అరెస్ట్.. 3.05కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్​!

Drugs Seized: పక్కాగా సమాచారాన్ని సేకరించిన శంషాబాద్ ఎస్వోటీ అధికారులు షాద్​ నగర్ పోలీసులతో కలిసి నలుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్​ చేశారు. వీరి నుంచి 3.‌‌‌‌05కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్​, ఓపీఎం, పాపీ స్ట్రా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్​ కమిషనర్​ అవినాష్ మహంతి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీలు బీ.రాజేశ్​, పీ.శోభన్ కుమార్​, అదనపు డీసీపీ శ్రీనివాస్​ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

ఉద్యోగం వెతుక్కుంటూ…
రాజస్థాన్​ రాష్ట్రం నాగౌర్​ జిల్లాకు చెందిన వికాస్​ సోహూ (26) 2016లో ఉద్యోగం వెతుక్కుంటూ షాద్ నగర్​ కు వలస వచ్చాడు. జాతీయ రహదారి 44పై రాయికల్​ టోల్ గేట్​ వద్ద ఉన్న సంజూ భాయ్​ మార్వాడీ దాబాలో వాచ్​ మెన్​ గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పని చేస్తూనే వంట పని నేర్చుకున్న వికాస్​ ఆ తరువాత కుకింగ్​ మాస్టర్​ గా మారాడు. ఇదెలా ఉండగా దాబా యజమాని అయిన సంజూ భాయ్​ కి గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో ధూల్​ పేటకు చెందిన సలీం అనే వ్యక్తి నుంచి గంజాయి కొని తెచ్చుకుని దాబాలో పెట్టుకునేవాడు. దానిని సేవించటంతోపాటు దాబాకు వచ్చే లారీ డ్రైవర్లు, ఇతరులకు అమ్మేవాడు కూడా. ఈ క్రమంలో సంజూ భాయ్​, వికాస్​ లు 2022లో గంజాయితో జడ్చర్ల పోలీసులకు పట్టుబడ్డాడు.

Also Read: KTR on BRS: సంపద సృష్టిలో.. దేశంలో తెలంగాణదే అగ్రస్థానం!

5‌‌‌‌వందల రూపాయలకు కొని 15వందల రూపాయలకు విక్రయించేవారు

ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన అతను కొన్నాళ్ల తరువాత బెయిల్ మీద విడుదలై గంజాయి దందా కొనసాగించారు. జల్​ పల్లికి చెందిన రాజు అనే వ్యక్తి నుంచి 30‌‌0 రూపాయలకు 25 గ్రాముల గంజాయిని కొని 500 రూపాయలకు అమ్మేవారు. అదే సమయంలో మధ్యప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన గణపత్​ అనే వ్యక్తి ద్వారా హెరాయిన్​, ఓపీఎం, పాపీ స్ట్రా తెప్పించుకుని వాటిని కూడా విక్రయించటం ప్రారంభించారు. 1‌‌0 గ్రాముల ఓపీఎంను 13వందల రూపాయలకు కొని 2వేల రూపాయలకు అమ్మేవారు. 250 గ్రాముల పాపీ స్ట్రాను 5‌‌‌‌వందల రూపాయలకు కొని 15వందల రూపాయలకు విక్రయించేవారు. ఒక గ్రాము హెరాయిన్​ ని 12వేల రూపాయలకు కొని 15వేల రూపాయలకు అమ్మేవారు. కాగా, గంజాయి సేవించే అలవాటు ఉన్న సంజూ భాయ్​ తీవ్ర అస్వస్థతకు గురై ఏప్రిల్ 28న చనిపోయాడు.

అప్పటి నుంచి వికాస్​ ఒక్కడే మాదక ద్రవ్యాల దందా చేస్తున్నాడు. గత వారం గణపత్​ నుంచి 1.5కిలోల హెరాయిన్​, 750గ్రాముల ఓపీఎం, 3.5కిలోల పాపీ స్ట్రా కొన్నాడు. దాంతోపాటు రాజు నుంచి 1.5కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దీంట్లో నుంచి కొంతమేర విక్రయించి 90వేలు సంపాదించాడు. మిగితా డ్రగ్స్​ ను దాబాలో భద్రపరిచాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన శంషాబాద్​ ఎస్వోటీ అధికారులు షాద్​ నగర్​ పోలీసులతో కలిసి దాబాపై దాడి చేశారు. వికాస్ ను అరెస్ట్​ చేసి హెరాయిన్​, ఓపీఎం, పాపీ స్ట్రా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Alos Read: Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి

నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు

అంతర్జాతీయ మార్కెట్​ లో ఈ మాదక ద్రవ్యాల విలువ 3.05కోట్ల రూపాయలు ఉంటుందని కమిషనర్ అవినాష్​ మహంతి చెప్పారు. ఇక, విచారణలో వికాస్ వెల్లడించిన వివరాలతో ధూల్ పేటకు చెందిన సలీం, జల్​ పల్లి నివాసి రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గణపత్​ ను కూడా అరెస్ట్​ చేశారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం షాద్​ నగర్ పోలీసులకు అప్పగించారు. మాదక ద్రవ్యాల దందా గురించి తెలిస్తే 100 లేదా 94906 17444 నెంబర్​ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కమిషనర్ అవినాష్ మహంతి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. ఇక, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ఓ కన్నేసి పెట్టాలన్నారు. ఎవరైనా డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?