Swiss Glacier Collapse: స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో (Alps Mountains) పెను విపత్తు సంభవించింది. ప్రకృతి ప్రకోపం ధాటికి ఏకంగా ఒక గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. లోట్స్‌చెంటర్ లోయ (Lötschental Vally) ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామం (Blatten Village)పై మంచు చరియలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. మే 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హిమపాతం ధాటికి 90% మేర గ్రామం మట్టిదిబ్బల్లో కూరుకుపోయింది. అయితే ఈ ఘటనలో 64 ఏళ్ల వృద్ధుడు గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. అతడి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
తప్పిన ప్రాణ నష్టం!
బ్లాటెన్ గ్రామంపై హిమపాతం కూలుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ (Viral Video) గా మారాయి. ప్రకృతి విపత్త ధాటికి కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే అందమైన బ్లాటెన్ గ్రామం శిథిలాల దిబ్బగా మారిపోయింది. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటు చూసి బురద మాత్రమే దర్శనమిస్తోంది. అయితే మంచు చరియలు విరిగి పడే అవకాశముందని ఈనెల 19న భూగర్భ శాస్త్రవేత్తలు అక్కడి ప్రజలను హెచ్చరించారు. దీంతో 300 మంది నివాసితులు, పశువులు ఉండే ఆల్ఫైన్ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. దీంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది.
Swiss Village of Blatten Buried by Glacier Collapse:
A 1.5 million m³ glacier crushed most of the Swiss village of Blatten. Authorities had time to evacuate residents, but a 64-year-old man remains missing.
Experts warn of further risks as the glacier debris has blocked the… pic.twitter.com/1WIQ4li4Ai
— Cyrus (@Cyrus_In_The_X) May 29, 2025
వాతావరణ మార్పులే కారణం!
వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులే ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదానికి కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఆల్ఫ్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు. బ్లాటెన్ గ్రామం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆ గ్రామ పెద్ద మాథియాస్ బెల్ వాల్డ్ స్పందించారు. కోల్పోయింది తమ గ్రామాన్నే కానీ, మనసును కాదని స్పష్టం చేశారు. ఒకరికొకరం అండగా నిలుస్తూ గ్రామానికి తిరిగి నిర్మించుకుంటామని పేర్కొన్నారు.
NEW: 90% of a Swiss village has been buried after a massive chunk of the Birch glacier broke off and crashed down into the valley.
This is insane.
"We have lost our village, but not our heart. We will support each other and console each other," said the town's mayor.
The… pic.twitter.com/4Fu5XfEDAN
— Collin Rugg (@CollinRugg) May 29, 2025
ఇంతకీ ఆ గ్రామం ప్రత్యేకత ఏంటీ!
స్విట్జర్లాండ్‌లోని లోట్స్‌చెంటర్ లోయలో బ్లాటెన్ గ్రామం ఉన్న సంగతి తెలిసిందే. పర్వత సానువుల మధ్య ఉండే సహజమైన ప్రకృతి సౌందర్యం, ప్రశాంత వాతావరణం.. బ్లాటెన్ గ్రామం ప్రత్యేకతగా చెప్పవచ్చు. మంచుతో కప్పబడిన శిఖరాలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు ఈ గ్రామానికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. శీతాకాలం పర్యటనకు ఈ గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. స్విట్జర్లాండ్ వెళ్లే పర్యటకులు.. తప్పకుండా ఈ గ్రామాన్ని సందర్శిస్తారని అధికారులు చెబుతున్నారు.