Plots Fraud9image credit: swetcha reporter)
హైదరాబాద్

Plots Fraud: ప్లాట్ కొనుగోలు పేరుతో మోసం.. 28.20 లక్షల నగదు దోచిన ముగ్గురు అరెస్ట్!

Plots Fraud: సహచరులతో కలిసి నమ్మిన స్నేహితున్నే దోచుకున్న వ్యక్తితోపాటు గ్యాంగ్​ సభ్యులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 28.2‌‌0లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్​ లోని క్యాంప్​ కార్యాలయంలో గురువారం జరిపిన మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్​ సుధీర్ బాబు, మహేశ్వరం జోన్​ డీసీపీ సునీతా రెడ్డితో క​లిసి వివరాలు వెల్లడించారు. ఎర్రకుంట నివాసి సయ్యద్​ అబ్దుల్​ ఖాదర్​ (34) వ్యాపారి. ముంతాజ్​ బాగ్​ జమాల్ బండ నివాసి హబీబ్​ హరూన్​ (41) అతని మేనమామ. కాటేదాన్​ లక్ష్మీగూడ నివాసి రసిక్​ నాథ్​ బర్దన్​ ఎలియాస్​ కిట్టూ (31), రషీద్​ ఖాన్​ వీరి స్నేహితులు. ఇక, సంతోష్​ నగర్​ లో నివాసముంటున్న ఇలియాస్​ (25) అబ్దుల్​ ఖాదర్​ కు మిత్రుత్వం ఉంది.
ప్లాట్​ కొనాలని…
ఇదెలా ఉండగా ఇలియాస్ బంధువైన మహ్మద్​ జకీర్​ తన అల్లుడు కబీర్​ బంధువు ఒబేద్ ద్వారా ఓ ప్లాట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం 29లక్షల రూపాయలు సిద్ధం చేసుకుని ఆ డబ్బును కబీర్ కు ఇవ్వాలని ఇలియాస్​ తో చెప్పాడు. అయితే, కబీర్ హైదరాబాద్ లో లేకపోవటంతో ఇలియాస్​ స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ కు ఫోన్ చేశాడు. విషయం చెప్పి డబ్బును నీ వద్ద పెడతానన్నాడు. తన స్నేహితుడు హబీబుల్లాతో కలిసి ఇంటికి వస్తున్నట్టు తెలిపాడు. ఈ విషయాన్ని సయ్యద్​ అబ్దుల్​ ఖాదర్ తన మేనమామ హబీబ్​ హరూన్​ తో చెప్పాడు.

Also Read: Gang Arrested: అంతర్​ రాష్ట్ర గ్యాంగ్​ అరెస్ట్.. 5 తపంచాలు…18 బుల్లెట్లు స్వాధీనం!

దోచుకోవాలని అప్పటికప్పుడు పథకం

ఈ క్రమంలో ఇద్దరు కలిసి నగదును దోచుకోవాలని అప్పటికప్పుడు పథకం వేసుకున్నారు. దాని ప్రకారం సయ్యద్​ అబ్దుల్​ ఖాదర్, హబీబ్ హరూన్​ లు ఎప్పటికప్పుడు ఇలియాస్, హబీబుల్లా ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకుంటూ చివరకు ఎర్రకుంట ప్రాంతంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి రమ్మనమని చెప్పి గూగుల్​ లొకేషన్ పెట్టారు. ఈ మేరకు ఇలియాస్​, హబీబుల్లా అక్కడికి వచ్చి సయ్యద్ అబ్దుల్ ఖాదర్​ కోసం ఎదురు చూడసాగారు.

అయితే, అతను రాకుండా రసిక్​ నాథ్ బర్దన్, రషీద్​ ఖాన్​ లను ద్విచక్ర వాహనంపై అక్కడికి పంపించారు. వచ్చీరాగానే ఈ ఇద్దరు ఇలియాస్, హబీబుల్లాపై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి నగదును దోచుకుని ఉడాయించారు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన బాలాపూర్​ పోలీసులు సయ్యద్ అబ్దుల్ ఖాదర్, హబీబ్ హరూన్, రసిక్​ నాథ్ బర్దన్ లను అరెస్ట్​ చేసి వారి నుంచి 28.20లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రషీద్​ ఖాన్​ కోసం గాలిస్తున్నారు.

Also Read: Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు