Vallabhaneni Vamsi: వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) ఎట్టకేలకు జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. ఇప్పటి వరకూ ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ రాగా, తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో వంశీ తీవ్రంగా బాధపడుతున్నారు. ఒక్కోసారి ఉన్నఫలంగా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో ఆయన కుటుంబీ సభ్యులు, అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వంశీకి ఉన్న ఆరోగ్య సమస్యలు, చికిత్స తీసుకోవాలనే దానిపై పూర్తి వివరాలు, మెడికల్ రిపోర్టులతో బెయిల్ ఇవ్వాలని హైకోర్టును లాయర్లు ఆశ్రయించారు. అంతేకాదు, ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవనే విషయాన్ని కూడా కోర్టుకు నివేదించారు. ఇవాళ వాదనలు విన్న హైకోర్టు.. వంశీకి బెయిల్ ఇచ్చింది. అంతేకాదు, వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మరికొద్ది సేపట్లో వంశీని.. ఆయుష్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ కొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉన్నది. ఆ కాపీ రాగానే ఆయుష్ ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Read Also- Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?
వంశీకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి?
2019 ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారని వంశీపై కేసు నమోదైనది. అయితే ఇక అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది.. రిలీజ్ కాబోతున్నారనే సమయంలో ఈ కేసు నమోదు కావడం, రిమాండ్‌కు విధించడంతో జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా, వంశీకి విపరీతమైన దగ్గు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. అరెస్టుకు ముందు నుంచే ఈ వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నారు. అందుకే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారీ.. వంశీ తరఫున లాయర్లు కోర్టుకు విన్నవించుకుంటూ వస్తున్నారు. మరోవైపు వంశీ సతీమణి పంకజశ్రీ సైతం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా చెందుతున్న పరిస్థితి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, విపరీతంగా దగ్గు వస్తోందని.. బరువు తగ్గిపోయారని పలుమార్లు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు.
Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?
రెండ్రోజుల వ్యవధిలోనే..
వల్లభనేని వంశీ మోహన్‌కు రెండు కీలక కేసుల్లో బిగ్ రిలీఫ్ దక్కింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శుక్రవారం నాడు వంశీకి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీకి శుక్రవారం సాయంత్రం సీఐడీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, రెండు రోజుల వ్యవధిలోనే రెండు కీలక కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ దక్కడంతో భారీ ఊరటే అని చెప్పుకోవచ్చు. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా.. శుక్రవారం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ బెయిల్ దక్కింది. అయితే రెండు కేసుల్లో రిలీఫ్ దక్కినా వంశీ మాత్రం జైలుకే పరిమితం అయ్యారు. ఎందుకంటే.. నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. శుక్రవారం నాడే వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రిమాండ్‌కు తరలించగా, గురువారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వంశీకి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు.
Read Also- YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. ఏం జరిగిందంటే..?