MLA Yennam Srinivas Reddy: బీఆర్‌ఎస్‌లో కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కవిత తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయడం, లేఖలోని అంశాలు, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అలాగే కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారే ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులపై అధికారపక్ష నేతలు తమ రీతిలో స్పందిస్తున్నారు. కేసీఆర్ అధికారంకోసం ఆడిస్తున్న డ్రామా అటూ కొట్టిపారేస్తున్నారు. ఇదే అంశంపై ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందిచారు. కవితపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత కుటుంబ సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చేందుకే ఇలాంటి కుతంత్రాలకు తెరతీశారంటూ మండిపడ్డారు.
ఉద్యమకారుల గొంతు కోసారు.
భారత దేశం కర్మ భూమి ఇక్కడి పాపాలకు ఇక్కడే శిక్ష అనుభవించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుల గోంతు కొడుకు, బిడ్డలు కోశారని, అందులో కవిత పాత్ర కూడా ఉందని అన్నారు. ఎంతో మంది రాజకీయ జీవితాలతో ఆడుకున్న కుటుంబం బీఆర్ఎస్ వాళ్లే అని, సొంత కుటుంబాన్ని కూడా మేనేజ్ చేసుకొని వ్యక్తి తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తాడని యెన్నం శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం ఉంటే తెలంగాణ నాశనం అవుతుందని అప్పుడే చెప్పాను. పనికి రాని ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ భారాన్ని ఇప్పుడు ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు.
Also Read: Jal Shakti Abhiyan: జలశక్తి అభియాన్‌లో దేశంలోనే.. తెలంగాణ 3వ స్థానం!
కొత్త సినిమా తెరలేపారు.
అధికారం లేకపోతే ఒక్క నిముషం లేని కుటుంబం, సొంత కుటుంబం సభ్యులు ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి రావడానికే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డినీ గెంటేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. TRS పెట్టడానికి, అధికారంలోకి రావడానికి కృషి చేసిన వేల మంది గొంతులు తడిగుడ్డతో కోశారు. తెలంగాణ ప్రజలకు కొత్త సినిమా కల్వకుంట్ల కుటుంబం చూపిస్తుందని అన్నారు. పాలనకు కేటీఆర్ అనర్హుడని కవిత చెబుతుంది. మరి కేసీఆర్ అధికారం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నాడా, లేక అధికార దాహం కోసం చూస్తున్నారా అని అన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఎన్ని కుతంత్రాలు చేసిన మరోసారి అధికారంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు.. ఫైనల్లో తలపడేది నలుగురే!