Pawan On Kadapa Tragedy
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Pawan Kalyan: ఇంకెంత కాలం అఘాయిత్యాలు.. కడప దారుణ ఘటనపై పవన్ తీవ్ర ఆవేదన

Pawan Kalyan: కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో మూడేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి, చంపేసిన ఘటన రాష్ట్రంలో పెను సంచలనమే సృష్టించింది. తల్లిదండ్రులతో పాటు బాలిక పెళ్లికి వెళ్లగా, అరటి పండు ఇస్తానని ఆశచూపిన కామాంధుడు ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. విషయం బయటపడుతుందని బాలికను హత్య చేశాడు. అయితే, నిందితుడిని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై నాలుగైదు రోజులుగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం పట్టించుకోలేదని, సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే, బుధవారం నాడు ఎక్స్ వేదిగా పవన్ స్పందించారు.

Read Also- Tollywood: దిల్‌రాజుపై బాంబు పేల్చిన జనసేన బహిష్కృత నేత.. మొత్తం బండారం బయటపెట్టేశారుగా!

వైఫల్యం ఎక్కడ?
‘ చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలి. నాలుగు రోజుల క్రితం వైఎస్సార్ కడప జిల్లా (Kadapa Tragedy), మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టి, హత్య చేయడం, అది కూడా బందువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నాను. ఈ వార్త నా హృదయాన్ని కకావికాలం చేసింది. సమాజంగా మన ఎక్కడ వైఫల్యం చెందాం? అనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉంది’ అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also- MLA Chintamaneni: మహానాడులో ఎమ్మెల్యే చింతమనేని మాస్ సందడి!

నాడు కథువా.. నేడు ఇలా..!
‘ ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. గతంలో కథువాలో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని కోరుకున్నాను. అయినా ఇలాంటివి జరుగుతున్నాయి.. అంటే నిందితుల్లో చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన కారణం కావొచ్చు. ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి పోక్సో కేసు (POCSO Act) నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయ శాఖ, పోలీస్ శాఖ, డీజీపీ, హోం మంత్రి అనితకు విజ్ఞప్తి చేస్తున్నాను. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు మొదలుకుని డీజీపీ, హోం మంత్రి వరకూ పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read Also- Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్‌కు బదులిచ్చిన పవన్.. థియేటర్ యాజమాన్యాలపై బిగ్ బాంబ్!

 

Just In

01

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే

Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే