MLA Chintamaneni: కడపలో తెలుగు దేశం పార్టీ మహనాడు అంగరంగ వైభవంగా జరుగుతంది. టీడీపీ మహానాడులో మాస్ సందడికి పెట్టింది పేరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈసారి అవకాయ పచ్చడితో సందడి చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకానికి ఆవకాయ పచ్చడితో సమాధానం అంటూ మహానాడులో 2లక్షల మందికి సరిపడా ఆవకాయ పచ్చడి స్వయంగా తయారు చేయించారు. కడపకు ప్రత్యేక వాహనంతోపాటు, పదమూడు వేల మామిడి కాయల లోడుతో వచ్చి, స్వీట్లతో పాటు నోరూరించే నాన్ వెజ్ వంటకాలూ దగ్గరుండి వండించే బాధ్యత ఆయన తీసుకొన్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
కడపలో తెలుగు తమ్ముళ్ల పసుపు పండగ మహానాడు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తల కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యా్హ్నం భోజనం, వరుకు సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం అన్ని ఏర్పాట్లను చేశారు. ఈసారి వంటల మెనూలో వెజ్‌తో పాటుగా నాన్‌వెజ్ వంటకాలు కూడా ఉన్నాయి. నోరూరించే మటన్, చికెన్‌తో పాటుగా స్పెషల్ మిఠాయిలు, స్వీట్లు కూడా మెనూలో వుంచారు. అయితే టీడీపీ మహానాడులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం ప్రతి సంవత్సరం ఓక స్పెషల్ వంటకం చేయిస్తుంటాడు. ఆయన తెలుగు తమ్ముళ్ల కోసం ఈసారి అవకాయ పచ్చడితో సందడి చేశారు.
Also Read: Cabinet Expansion: ముందుకు సాగని మంత్రివర్గ విస్తరణ.. మోక్షమెప్పుడో!
తెలంగాణ వంటకాలతో ప్రత్యేకం
తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగురాష్ట్రాలైన ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ వంటకాలతో ప్రత్యేకంగా మెనూ రూపొందించారు. గత రెండు రోజులుగా రెండు లక్షల మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. రేపు జరిగే బహిరంగ సభకు వచ్చేవారి కోసం మహానాడు ప్రాంగణంలో, బయట ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.
మొదటి రెండు రోజుల్లో రెండు లక్షల మందికిపైగా భోజనం ఏర్పాటు చేయగా, గురువారం బహిరంగ సభ రోజు మహానాడు ప్రాంగణంలో రెండు లక్షల మందికి ఆహారం అందిస్తారు. ప్రాంగణం వెలుపల నాలుగు వైపులా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. అక్కడ సుమారు మూడు లక్షల మందికి భోజనాలు అందజేస్తారు. ప్రతిరోజు మహనాడలో భోజనతో కనీసం 20 రకాల వంటకాలు ఉండేలా చూసుకుంటారు.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!