Lord Shiva: మహా దేవుడు మెడలో పాముతో , తల మీద చేతిలో త్రిశూలాన్ని ధరించి స్మశానంలో ఉన్న శివుడిని చూస్తే.. సామాన్య మానవులే కాదు, దేవతలు కూడా భయపడతారు. ఆయన రౌద్ర రూపం భీతి కలిగించేలా ఉంటుంది. మహా దేవుని రూపం అన్ని దేవుళ్ళ కంటే విచిత్రంగా ఉంటుంది. దేవతలందరూ స్వర్గంలో ఉంటే శివుడు మాత్రం స్మశానంలోనే నివసిస్తాడు. ఇలా ఎందుకు ఉంటాడో ఎవరికీ తెలియదు. దీని వెనుక ఉన్న భయంకరమైన రహస్యాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Rangareddy district: వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం.. అధికారులకు కలెక్టర్ కీలక అదేశాలు!
శివుడు అర్ధాంగి అయిన ఉమా దేవి, తన భర్తను ఇలా అడుగుతుంది. అన్ని సౌకర్యాలు ఉంచుకుని, స్మశానంలోనే ఎందుకు ఉంటున్నావ్ అని పార్వతి దేవి శివుడ్ని ప్రశ్నించింది. అయితే, స్మశానంలోనే అన్ని విసర్జిత వస్తువులే ఉంటాయి. జుట్టు, ఎముకలు, మానవ కపాలాలు, పగిలిన కుండలు పడి ఉంటాయి. అలాగే గద్దలు, నక్కలు తిరుగుతుంటాయి. ఎటు వైపు చూసినా చితులు కాలుతుంటాయి. మాంసం, రక్తం, శరీర భాగాలు , ఎముకలు గూళ్ళు చెల్లా చెదురుగా నేలంతా ఉంటాయి. ఇలాంటి ఆ పవిత్ర స్థానంలో ఎందుకుంటున్నారని పార్వతి దేవి మహా దేవుణ్ణి అడుగుతుంది.
శివుడు అందుకే స్మశానంలోనే ఉంటాడా?
దేవి నేను రాత్రి, పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడా ఉంటుందా అని వెతుకుతుంటాను. ఈ స్మశానానికి మించిన ప్రవిత్ర మైన ప్రదేశం ఎక్కడా కనిపించలేదు. అందుకే, ఇక్కడ నివాసం ఉంటున్నాను. మర్రి చెట్టు ఆకులు, మృతుల శరీరాల నుండి తెగి రాలి పడినపూల దండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూత గణాలకు నివాసం. నా భూత గణాలు లేకుండా నేను ఉండలేను. ఈ చోటే నాకు స్వర్గం, ఇదే నాకు చాలా ఇష్టం. ఇది ఆపవిత్రమైన చోటు కాదు. పరమ పూజ్య మైన ప్రదేశం. పవిత్రమైన శక్తుల కోసం ఉపాసించే వారు ఇక్కడే తమ ఆరాధన చేస్తారు. ఇది వీరుల నివాస స్థానం. కపాలాలతో నిండి ఉండే ప్రదేశం నా కంటికి అందంగానే కనివిస్తుందని శివుడు చెప్పాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.