Fake iPhone Spare Parts: సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆబిడ్స్ పోలీసులతో కలిసి ఆబిడ్స్ జగదీష్ మార్కెట్ లోని పలు దుకాణాలపై దాడులు జరిపారు. ఈ క్రమంలో నలుగురు దుకాణందారులను అరెస్ట్ చేసి వారి నుంచి కోటి రూపాయల విలువ చేసే ఐఫోన్ నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్ మార్కెట్ లో కొందరు వ్యాపారులు ఐఫోన్ నకిలీ విడిభాగాలను విక్రయిస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. గేమ్స్ ఆడొద్దన్న తల్లి.. ప్రాణాలు తీసుకున్న బిడ్డ!
ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆబిడ్స్ పోలీసులతో కలిసి దాడులు జరిపారు. శ్రీమాతాజీ మొబైల్ షాప్ నిర్వాహకుడు, గౌలిగూడ నివాసి విక్రమ్ సింగ్ (30), ఆర్జీ మొబైల్స్ యజమాని గౌలిగూడ వాస్తవ్యుడు సురేశ్ కుమార్ రాజ్ పురోహిత్ (25), సుల్తాన్ బజార్ నివాసి, రాజారాం మొబైల్స్ షాపు ఓనర్ నాథూరాం చౌదరి (25), గౌలిపురం వాస్తవ్యుడు, సప్నా మొబైల్స్ యజమాని అయిన మహ్మద్ సర్ఫరాజ్ (24)లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఐఫోన్ నకిలీ విడిభాగాలైన ఇయర్ పాడ్స్, పవర్ బ్యాంకులు, యాపిల్ లోగో స్టిక్కర్టు, అడాప్టర్లు, అడాప్టర్ కవర్లు, యూఎస్బీ కేబుల్లు, బ్యాటరీలు, బ్యాక్ గ్లాసులు, సిలికాన్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను ఈ నలుగురు ముంబయికి చెందిన మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి తక్కువ ధరలకు వీటిని కొని ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుగా విచారణలో వెల్లడైంది.
Also Read: Suravaram Pratap Reddy University: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. నోటిఫికేషన్ రిలీజ్!