BRS Shankar Nayak: నేను సీరియస్ గా చెబుతున్న శంకర్ నాయక్ చెబుతున్నాడు గుర్తుపెట్టుకోండి. వచ్చేది మా(బిఆర్ఎస్) ప్రభుత్వమే. వచ్చాక మీ సంగతి చూస్తాం. అంటూ గూడూరు తాత్కాలిక ఎస్ హెచ్ ఓ (ప్రొహిబిషన్ ఎస్సై) కోటేశ్వరరావుకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాస్ వార్నింగ్ తో దమ్ కి ఇచ్చాడు. ఇది మాట్లాడింది వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. శంకర్ నాయక్ ఇది కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు వివాదాస్పదానికి దారి తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొలి కలెక్టర్ ప్రీతి మీనా విషయంలో అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు ఆమె చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన తేజావత్ భద్రు అదే గ్రామానికి చెందిన తేజావత్ వీరేందర్ కు అప్పుగా రూ.50,000 ఇచ్చాడు. దీంతోపాటు భద్రుకు వీరేందర్ కు మధ్య భూ వివాదం కూడా ఉంది. ఈ క్రమంలోనే భద్రుపై కక్ష పెంచుకున్న వీరేందర్ మరి కొంతమందితో కలిసి హత్యకు ప్రణాళిక రచించి అంతమొందించాడు. కాగా, భద్రు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి గూడూరు మండల కేంద్రానికి వెళ్లిన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భద్రు మృతికి సంతాపం తెలిపేందుకు గుండెంగ గ్రామానికి చేరుకున్నాడు.
Also Read: MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావు ఆక్రమణలో పేదల భూములు.. అన్యాయం చేశారు!
ఈ క్రమంలోనే హత్యకు గల కారణాలను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గూడూరు పోలీస్ స్టేషన్ తాత్కాలిక ఎస్ హెచ్ ఓ గా పనిచేస్తున్న పి ఎస్ ఐ కోటేశ్వరరావుకు ఫోన్ చేసి కేసులో అసలు నిందితులను వదిలివేశారు. నీకు మంచి కేసు అవుతుంది. ఈ కేసు పై మంచిగా దర్యాప్తు చేసి అసలు నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఆ క్రమంలోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాటల్లోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతున్నాడు. కేసు పై సరైన దర్యాప్తు చేసి అసలు నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడు. సీరియస్ గా తీసుకోండయ్యా అసలు నీకు వేయలేదట కదా. చూడండి మీ పేరు ఏంటిది.
అమ్మ కోటేశ్వరరావు సీరియస్ తీసుకోండి. యాహే ఇది నీకు మంచి కేసు అయితది. అసలోన్నీ వదిలిపెట్టిరట మీరు వదిలిపెట్టిన మేము వదిలిపెట్టం. వచ్చేది మా రాజ్యమే గుర్తుపెట్టుకోండి. నేను సీరియస్ చెప్తున్నా. శంకర్ నాయక్ చెప్తున్నాడు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చెప్తున్నాడు. సీరియస్ తీసుకోండి. వాడు ఇంటికి పిలిచి డబ్బులు తీసుకొని చంపిందంటే వానికి ఎంత బలుపు ఉండాలే. ప్లస్ పోలీస్, పోలీస్ అంటే. ఈ సమయంలోనే ఎస్సై కోటేశ్వరరావు స్పందిస్తూ సరైన యాక్షన్ తీసుకుంటామన్నాడు. నాకు అవన్నీ చెప్పొద్దు నాన్న. నేను చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. నేను డిఎస్పీ గారికి కూడా చెప్పిన. శిక్ష అంటూ లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటయ్ అంటూ పోలీస్ అధికారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సదరు పోలీస్ అధికారిపై బూతు పురాణం సైతం ప్రదర్శించాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
Also Read: Chief Election Commissioner: పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు డిపాజిట్ సౌకర్యం.. ఏంటది!