Chief Election Commissioner (imagecredit:twitter)
తెలంగాణ

Chief Election Commissioner: పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు డిపాజిట్ సౌకర్యం.. ఏంటది!

Chief Election Commissioner: ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ స్టేషన్ల వెలుపల మొబైల్ డిపాజిట్ సౌకర్యం కల్పించడంతో పాటు, కాన్వాసింగ్ నిబంధనలను సమీకరించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లకు సౌలభ్యం కల్పించడం, ఎన్నికల రోజు ఏర్పాట్లను సులభతరం చేయడం తమ లక్ష్యం అన్నారు. ఈ రెండు సూచనలు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో, ఓటర్లు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎన్నికల రోజున మొబైల్ ఫోన్ల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ గుర్తించిందన్నారు. దీంతోనే పోలింగ్ స్టేషన్ల వెలుపల మొబైల్ డిపాజిట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు.

Also Read: Kavitha Letter: కవిత మరో షర్మిల.. లేఖ వెనక సీఎం రేవంత్.. మెదక్ ఎంపీ

పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల దూరంలో మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ మోడ్‌లో మాత్రమే అనుమతిస్తామన్నారు. పోలింగ్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద సాధారణ బాక్సులు లేదా జనపనార సంచులలో ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లు మొబైల్ ఫోన్లను పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. అయితే, స్థానిక పరిస్థితుల ఆధారంగా రిటర్నింగ్ అధికారి కొన్ని పోలింగ్ స్టేషన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వొచ్చని వెల్లడించారు. 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనలలోని 49ఎమ్ నిబంధన ప్రకారం, ఓటింగ్ రహస్యతను కచ్చితంగా కాపాడతామని కమిషన్ స్పష్టం చేసింది.

Also Read: Kamal Haasan: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇది నా ప్రామిస్!

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!