MP Raghunandan Rao (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

MP Raghunandan Rao: ఎంపీ రఘునందన్ రావు ఆక్రమణలో పేదల భూములు.. అన్యాయం చేశారు!

MP Raghunandan Rao: మాకు న్యాయం చేయమని ఎంపీ రఘునందన్ రావు వద్దకు వెళితే న్యాయం చేస్తానని చెప్పిండు. ఆ భూముల జోలికి వచ్చినోళ్ళని చీపుర్లు చెప్పులు మెడలో వేసి కొట్టాలని చెప్పిన వ్యక్తి మాకు అన్యాయం చేశారని బాధిత చౌదర్ పల్లి మహిళా రైతుల కన్నీటి పర్యంతమయ్యారు. దుబ్బాక నియోజక వర్గం చౌదర్పల్లి గ్రామ శివారులో ఉన్న 294 సర్వే నెంబర్ లో ని 84 ఎకరాలు మా భర్తలకు తాగించి తినిపించి లీజ్ రాయించుకున్నారని మా భూములు మాకు ఇప్పించి న్యాయం చేయాలని మహిళా రైతులు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. లీజు పేరిట రాసుకుంటే, తమకు కొంత డబ్బు ఇస్తే తాము సంతకాలు పెట్టామని, తమ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలువదని రైతులు చెపుతున్నారు. ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తమకు తిరిగి పట్టాలు ఇప్పించాలని 40 మంది రైతులు కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మొర పెట్టుకున్నారు. వారి మాటల్లోనే..

మాకు కానీ పట్టాలు ఎంపీ కుటుంబ సభ్యులకు ఎట్లయితవి పల్లెపు రేణుక చౌదరి

తహసిల్దార్ వద్దకు తిరిగి తిరిగి చెప్పులు అరిగినవి ప్రభుత్వ అసైన్మెంట్ భూములు ఇవి పట్ట కావని చెప్పిన తాసిల్దారు ఎంపీ కుటుంబ సభ్యులపై ఎలా మార్చారని చౌదర్పల్లి గ్రామానికి చెందిన మహిళ రైతు పల్లెకు రేణుక భర్త బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు. మా మొగుళ్ళుకు తాగిపించి, తినిపించి,మాభూములను లీజుకు రాయించుకున్నారు. మాకు భూములు రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలవదు మాబూములు మాకు ఇప్పించండి సారు అంగటూ వేడుకున్నారు.

రేషన్ బియ్యం లేకుంటే మా కుటుంబం అంతా హత్మహత్య చేసుకోవాల్సిందేనిని గురజాల నర్సవ్వ ఆవేదన చెందారు. తినడానికి తిండి లేని పరిస్తితి మా కుటుంబానిది. రేషన్ బియ్యం లేకుంటే తామంతా ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని. మాబూములు మాకు ఇప్పించండి అని చౌదర్ పల్లి గ్రామ రైతు గురజాల నర్సవ్వ ఆవేదన చెందారు. మా భూముల చుట్టూ కంచ వేసి మమ్మల్ని రానివ్వడం లేదు. గ్రామంలో జీవనోపాధి లేక మాకుమారులు పట్టణాలకు వలస వెళ్ళారు. మాభూములు మాకు ఇప్పించండి అని కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: Bhoodan scam: ప్రకంపనలు సృష్టిస్తున్న నాగారం భూదాన్‌ కుంభకోణం.. నాకింత నీకింత!

మాపిల్లలపై కేసులు పెట్టారని ఎంపీ దగ్గరకు పయినం పల్లెపు లక్ష్మీ

అప్పటి అధికార పార్టీ (బీఅర్ఎస్ నేతలు) మా పిల్లలపై కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు వద్దకు తాము వెళ్లామని, రైతు పల్లెపు లక్ష్మీ తెలిపారు. మీరే కాస్తులో ఉండండి, ఎవరు వచ్చినా చెప్పులు, చీపుర్లతో కొట్టండి, చెప్పులు మెడలో వేయండి అని చెప్పిన ఎంపీ రఘునందన్ రావు ఇప్పుడు మాభూములను కాజేసిండు అని లక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు. మాపిల్లలపై పెట్టిన కేసులు అలానే ఉన్నాయని చెప్పారు. మాబూములు మాకు ఇప్పించండి అంటూ వేడుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

చౌదర్ పల్లి బాధిత రైతులకు అండగా ఉంటామని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని బాధిత రైతులకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత రైతులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాళ్లపై పడి మాభూములు మాకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 40 మంది రైతులు సంతకాలు పెట్టి శ్రీనివాస్ రెడ్డి కి రైతులు వినతి పత్రాన్ని సమర్పించారు.

Also Read: CM Revanth Reddy: 2047 నాటికి భారత దేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలి.. సీఎం కీలక వ్యాఖ్యాలు!

 

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?