Warangal Traffic Police( image credIt: twitter)
నార్త్ తెలంగాణ

Warangal Traffic Police: ట్రాఫిక్ పోలీసుల నయా దందా.. అక్రమాలపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!

Warangal Traffic Police: కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్టు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అందినకాడికి దోచుకునేందుకు ఎక్కడ వెనుకాడడం లేదు అక్రమార్కులు. కొత్త కొత్త అక్రమ దందాలకు తెరలేపుతున్నారు అక్రమార్కులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పార్కింగ్ నిర్వాహకులతో కలిసి చేస్తున్న కొత్తదందా అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ టూ వీలర్స్ ను ప్రైవేట్ పార్కింగ్ లో పెట్టీ కోర్టు క్లియరెన్స్ అయ్యే వరకు అక్కడే ఉంచి పార్కింగ్ వద్ద అందినకాడికి దోచుకుని నీకింత… నాకింత అని పంచుకుంటున్నారు. పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పార్కింగ్ నిర్వాహకులు చేస్తున్న అక్రమాలపై స్వేచ ప్రత్యేక కథనం….

దందా సాగేది ఇలా…..

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో పలువురు ట్రాఫిక్ పోలీసులు అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరుతో నగరంలోని పలు ప్రధాన కూడలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన టూ వీలర్స్ ను బస్టాండ్, రైల్వే స్టేషన్ ఆవరణలోని ప్రైవేట్ పార్కింగ్ సెంటర్ లో పెడుతారు. పట్టుబడినవారు కోర్టు క్లియరెన్స్ చేసుకుని కోర్టులో ఫైన్ చెల్లించి వాహనం తీసుకునేందుకు వెళితే అసలు కథ అక్కడ మొదలు అవుతుంది. పార్కింగ్ సెంటర్ నిర్వాహకులు పార్కింగ్ ఫీజు ఇష్టారాజ్యంగా వేసి వసూలు చేస్తారు.

వసూలు చేసిన డబ్బులకు రసీదు ఇవ్వరు. ఫార్కింగ్ లో డబ్బులు వసూలు చేసినట్టు ఆధారం లేకుండా డబ్బులు వసూలు చేస్తారు. వసూలు చేసిన డబ్బులకు సపరేట్ బుక్ మెయింటెయిన్ చేశారు. తరువాత వసూలు అయిన డబ్బులను ట్రాఫిక్ పోలీసులు, పార్కింగ్ సెంటర్ నిర్వాహకులు పంచుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారు బయటకి చెప్పుకోలేక వారి విధించినట్టుగా భారం అయిన గుట్టుగా పార్కింగ్ ఫీజు చెల్లించి వెళుతున్నారు. ఎక్కువ మొత్తం డబ్బులు పడ్డవారు చెల్లించలేని పరిస్థితిలో అక్కడే వదిలేస్తున్నారు.

AlSO READ: Mallu Ravi – Ponnam: నోరు జాగ్రత్త.. చెప్పులకు పని చెప్తాం.. కేటీఆర్‌కు ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!

కొట్టులో ఫైన్ కట్టాలి… పార్కింగ్ ఫీజు కట్టాలి… అయిన టూ వీలర్ కు సెక్యూరిటీ ఉండదు

కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన కంది రమేష్ గత నెల 17న హనుమకొండ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ద్విచక్రవాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని ధృవీకరణ పత్రాలు సమకూర్చుకుని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు విధించిన రూ.1500 జరిమానా చెల్లించి టూ వీలర్ విడిపించుకునేందుకు పోలీసుల వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్లినా రమేష్ వారు చెప్పింది విని అవాక్కు అయ్యారు.

వాహనం కావాలంటే రూ.1800 ఇవ్వాలని ప్రైవేట్ అక్షయ టూ వీలర్ పార్కింగ్ నిర్వాహకులు చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. తీసుకునే డబ్బులకు రసీదు ఏమైనా ఇస్తారా అని అడిగితే ఎలాంటి రశీదు ఇవ్వరని పార్కింగ్ నిర్వాహకుడు అన్నదాని బాధితుడు పేర్కొన్నారు. రసీదు ఇవ్వకుండా డబ్బులు ఎలా వసూలు చేస్తారని పార్కింగ్ నిర్వాహకుడిని ప్రశ్నించగా మీరు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుకొండి అని బుకాయించడంతో నాకేమి తెలియదడంటూ బుకాయించాడు. టూ వీలర్ వద్దకు వెళ్ళి చూడగా అందులో పెట్రోల్ లేకుండా పోయింది. డిస్క్ బ్రేక్ గడ్డ పోయిందని రమేష్ తెలిపారు. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు రమేష్ పేర్కొన్నారు.

Also Read: Covid panic: హైదరాబాద్‌లో కొవిడ్‌ కలకలం – వైద్యుడికి పాజిటివ్!

ఫైన్ రూ.1500…. పార్కింగ్ ఫీజు రూ. 13000

ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వ్యవహారంలో ఇటీవలే వరంగల్ లో ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. డబ్బులు సకాలంలో సమకూరకపోవడంతో ఆలస్యంగా కోర్టుకు వెళ్లి కోర్టు విధించిన రూ.1500 జరిమానా చెల్లించి వాహనం తీసుకునేందుకు పోలీసుల వద్దకు వెళ్ళగా వరంగల్ లోని బాలాజీ టూ వీలర్ పార్కింగ్ సెంటర్ లో నీ టూవీలర్ ఉంది వెళ్ళి తీసుకోమని పోలీసులు చెప్పారు. టూ వీలర్ తీసుకునేందుకు అక్కడి వెళ్ళగా రూ.13000 చెల్లిస్తే టూ వీలర్ ఇస్తామని పార్కింగ్ నిర్వాహకుడు చెప్పడంతో కంగు తిన్న టూ వీలర్ ఓనర్ కు నోట మాటలు రాకుండా పోయాయి.

పట్టుకున్న వాహనాలకు బాధ్యత ఎవరు వహిస్తారు…?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వాహనాలకు పట్టుకున్న పోలీసులే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పట్టుకున్న టువిలర్స్ ప్రైవేట్ పార్కింగ్ సెంటర్ లో పెట్టడం వాటికి అనాధికారికంగా డబ్బులు వసూలు చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా పలువురు ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పార్కింగ్ నిర్వాహకులతో కలిసి కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Niloufer Superintendent: నిలోఫర్ సూపరింటెండెంట్ అత్యుత్సాహం.. మంత్రి పై అసత్య ప్రచారాలు!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?