Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today : బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా గోల్డ్ తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

అయితే, గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది లోనైనా ధరలు తగ్గుతాయని అనుకున్నారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.

ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.98,080 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

అయితే, గత రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) ఈ రోజు మళ్లీ పెరగడంతో  కొనుగోలుదారులు కూడా కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. 22 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 500 కు తగ్గి రూ.89,900 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.550 కు తగ్గి రూ.98,080 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,900

విజయవాడ ( Vijayawada) – రూ. 89,900

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,900

వరంగల్ ( warangal ) – రూ.89,900

24 క్యారెట్లు బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 98,080

విజయవాడ – రూ.98,080

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.98,080

వరంగల్ ( warangal ) – రూ.98,080

వెండి ధరలు

గత కొద్దీ రోజుల నుంచి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.5000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,10,900 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

హైదరాబాద్ – రూ.1,10,900

విజయవాడ – రూ. 1,10,900

విశాఖపట్టణం – రూ. 1,10,900

వరంగల్ – రూ.1,10,900

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?