అంతర్జాతీయం

America : ఆకాశ వీధిలో మూడో సారి పయనం

  • మూడో సారి అంతరిక్ష యానం చేయనున్న సునీతా విలియమ్స్
  • మే 6న స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో నింగిలోకి ప్రయాణం
  • నాసా నిర్వహిస్తున్న తొలి మానవ రహిత యాత్ర
  • కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మహిళ
  • 322రోజులు అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా రికార్డు
  • గుజరాత్ కు చెందిన సునీతా విలియమ్స్ పూర్వికులు
  • అమెరికాలో స్థిరపడ్డ సునీతా విలియమ్స్
  • సాహస మహిళలకు స్ఫూర్తిగా నిలచిన సునీతా విలియమ్స్

Sunita Williams indian origin 3rd time space travel nasa :
రెండు సార్లు అంతరిక్షయానం చేసి నాలుగు సార్లు స్సేస్ వాక్ చేసిన సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యానం చేయనున్నారు. కాగా ఈసారి ఆమెతో పాటు బట్స్ విల్మోర్ కూడా అంతరిక్షానికి వెళ్లనున్నారు. వీరిద్దరూ వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి ప్రయాణం చేయనున్నారు.

కల్పనా చావ్లా తర్వాత
అమెరికాకు చెందిన నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా వ్యోమనౌకలో నిర్వహిస్తున్న తొలి మానవ రహిత యాత్ర ఇది. ఇందులో భాగంగా స్టార్‌లైనర్‌ సామర్థ్యాలను పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే.. ఐఎస్‌ఎస్‌కి వ్యోమగాములను పంపే మిషన్ల కోసం ఆ వ్యోమనౌకను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్‌ గుర్తింపు పొందారు.సునీతా విలియమ్స్ పేరు వినగానే.. అంతరిక్ష యానంలో ఆమె చేసిన సాహసాలు గుర్తుకు వచ్చి ప్రతి మహిళ గర్వంగా ఫీల్ అవుతారు. యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిగా పనిచేసిన ఆమె నాసా వ్యోమగామి. రెండుసార్లు అంతరిక్ష యానం చేయడంతో పాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. ఎక్కువ రోజులు (322రోజులు) అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా ప్రపంచ చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు నీటి అడుగుభాగంలో తొమ్మిదిరోజులు ఉండి మరొ కొత్త రికార్డును ఆమె తన ఖాతాలో జమచేసుకున్నారు. ప్రస్తుతం నాసాలో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు.

1998 లో నాసాకు ఎంపిక

సునీతా విలియమ్స్ యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దీపక్ పాండ్య, బొన్నీ పాండ్య. దీపక్ పాండ్య తండ్రి, తాత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సునీత మసచుసేట్స్ లోని నీధం హై స్కూల్ లో చదివారు. 1987లో యు.ఎస్. నావల్ అకాడమీ నుండి భౌతికశాస్త్రంలో బి.ఎ. పట్టా అందుకున్నారు. యుద్ధ విమానాల పైలట్‌గా నియమించబడిన ఆమె నావల్ టెస్ట్ పైలట్ స్కూలు నుంచి 1993లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1995లో ఎం.ఎస్సీ, పట్టా అందుకున్నారు. ఆ తర్వాత 1998లో నాసాకు ఎన్నికయ్యారు. పైలట్ శిక్షణ పొందిన సునీత వ్యోమనౌకలో పయనించడంతో పాటు నాసా అంతరిక్షంలో ఏర్పాటుచేసిన స్పేష్ స్టేషన్ లోనూ పనిచేశారు.

195 రోజులు అంతరిక్షంలో

విలియమ్స్ ఎఎస్-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషనుకు డిస్కవరీ వ్యోమనౌకలో మొదటిసారి డిసెంబర్ 9, 2006లో పయనమయ్యారు. ఏప్రిల్ 2007లో తిరిగి భూమి మీదకు వచ్చారు. రికార్డు స్థాయిలో విలియమ్స్ 195రోజులు అంతరిక్షంలో ఉన్నారు. నింగిలోనే కాదు నీటిలోనూ ఆమె సాహసాలు చేశారు. నీమో2 సంస్థలో సభ్యత్వం పొందిన ఆమె నీటి అడుగు భాగంలో ఉండే ఆక్వాటిక్ లో తొమ్మిది రోజులు ఉన్నారు. సునీతా పూర్వీకులు భారతీయులు కావడంతో ఆమె 2007లో ఇండియాకు వచ్చారు.
రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, ట్రయాథాన్, స్నోబోర్డింగ్, హంటింగ్ ఆమె అభిరుచులు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సునీతా అందుకున్నారు. సునీత తొలి పర్యటన.. 2006 డిసెంబరు నుంచి 2007 జూన్‌ వరకు సాగింది. నాడు మొత్తం నాలుగు విడతల్లో 29 గంటల 17 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. తర్వాత 2012లో నాలుగు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో విధులు నిర్వర్తించారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ