Saraswati Pushkaralu: పుష్కరాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ.
Saraswati Pushkaralu (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Saraswati Pushkaralu: పుష్కరాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీ.. ఇంకా 4 రోజులే చాన్స్!

Saraswati Pushkaralu: భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతి నదీ పుష్కర మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం సహా పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు, హారతులతో ఘాట్‌ల పరిసరాలు భక్తిశ్రద్ధలతో మార్మోగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం బారీ క్యూలైన్లలో నిలబడి భక్తిని చాటుకుంటున్నారు.

పుష్కర స్నానానికి భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది సహా వాలంటీర్లు సమర్థంగా సేవలందిస్తున్నారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్ననేపథ్యంలో, అధికారులు అదనపు ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, వైద్య సహాయ కేంద్రాలు, విస్తృతంగా అందుబాటులో తెచ్చారు.

Also Read: Miss World Contestants: శిల్పారామంలో అందాల భామల సందడి.. బతుకమ్మ ఆడిన వీడియో వైరల్

పుష్కరాల ముగింపుకు ఇంకా 4 రోజులు సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు. భక్తులు పుష్కరాల్లో పాల్గొనాలని, సూచించిన మార్గదర్శకాలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు. భారీ వర్షంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు కొంత అసౌకర్యం కలిగింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..