Miss World Contestants (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Miss World Contestants: శిల్పారామంలో అందాల భామల సందడి.. బతుకమ్మ ఆడిన వీడియో వైరల్

Miss World Contestants: ప్రపంచ సుందరీమణులు గత కొన్ని రోజులుగా తెలంగాణలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తూ.. తెలంగాణ సంస్కృతికి వారు ముగ్దులు అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని శిల్పారామాన్ని (Shilparamam) మిస్ వరల్డ్ భామలు సందర్శించారు. అయితే బుధవారం రాత్రే వారు శిల్పారామానికి వెళ్లాల్సి ఉండగా వర్షం వల్ల అది వాయిదా పడింది.

బతుకమ్మ ఆడిన అందాల భామలు!
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండగకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఆ పర్వదినం రోజున తెలంగాణ స్త్రీలు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ బతుకమ్మను కొలుస్తారు. అయితే తాజాగా శిల్పారామాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ భామలు.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా’ అంటూ బతకుమ్మ ఆడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు చూసి ఫిదా అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కుండల తయారీ పరిశీలన
తెలంగాణలోని పురాతన చేతి వృత్తుల్లో కుండల తయారీ ఒకటి. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ భామలకు వాటి గురించి తెలిసేలా శిల్పారామంలో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. మట్టికుండలను ఎలా తయారు చేస్తారో ఆ స్టాల్స్ ద్వారా కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా ప్రపంచ సుందరిమణులు తమ స్వహస్తాలతో మట్టి కుండలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Also Read: TDP vs Janasena: కూటమిలో మళ్లీ విభేదాలు.. జనసేన నేతపై నోరుపారేసుకున్న టీడీపీ నాయకుడు!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!