Modi Fires on Pakistan: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోమారు స్పందించారు. భద్రతా బలగాల ధైర్య సాహసాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆపై 2019లో చేసిన వ్యాఖ్యలను ప్రధాని పునరుద్ఘటింటారు. ‘ఈ దేశ నేల మీద నేను ప్రమాణం చేస్తున్నా. నా దేశాన్ని నాశనం చేయనివ్వను. నా దేశాన్ని నేను తలదించుకోనివ్వను’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా దయాది దేశం పాక్ (Pakisthan) కు ఉహించిన దానికంటే పెద్ద శిక్ష వేసినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పహల్గాం దాడి.. అందర్నీ కదిలించింది
ప్రధాని మోదీ రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని.. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ పై మాట్లాడారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు.. మన సోదరిమణుల మతం గురించి అడిగి వారి నుదుటిపై సిందూరాన్ని చెరిపివేశారని ప్రధాని గుర్తుచేశారు. పహల్గాం దాడిలో వారు పేల్చిన బుల్లెట్లు.. 140 కోట్ల మంది దేశ ప్రజల హృదయాలను బలంగా తాకాయని చెప్పారు. దీంతో దేశంలోని పౌరులంతా ఐక్యమై.. ఉగ్రవాదులను తుడిచి పెట్టాలని నిర్ణయించారని చెప్పారు. వారు ఊహించిన దానికంటే పెద్దగా శిక్షించామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
22 నిమిషాల్లో 9 స్థావరాలు ధ్వంసం
5 ఏళ్ల క్రితం బాలాకోట్ లో వైమానిక దాడులు చేసిన తర్వాత తొలి బహిరంగ సభ రాజస్థాన్ లోనే జరిగిందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈసారి కూడా ఆపరేషన్ సిందూర్ తర్వాత తన తొలి బహిరంగ సమావేశం.. రాజస్థాన్ లో జరగడం యాదృచ్ఛికమని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు.. 22 నిమిషాల్లోనే పాక్ లోని 9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత త్రివిధ దళాలు కలిసి పాక్ ను చక్రవ్యూహంలో బంధించాయని చెప్పారు. నుదిటిన పెట్టుకునే సిందూరం.. గన్ పౌడర్ గా మారితే ఎలా ఉంటుందో యావత్ ప్రపంచంతో పాటు మన శత్రువులు కూడా చూశారని ప్రధాని అన్నారు.
Also Read: YS Jagan on TDP: అప్పుల కుప్పగా రాష్ట్రం.. స్కాముల్లోనూ పరాకాష్ట.. వైఎస్ జగన్ ఫైర్!
పాక్ తలవంచక తప్పలేదు
మన సైనికుల పరాక్రమం దెబ్బకు పాకిస్థాన్ మోకరిల్లిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తలవంచక తప్పలేదని పేర్కొన్నారు. మన సోదరిమణుల సిందూరాన్ని లక్ష్యంగా చేసుకుంటే.. దాని వల్ల జరిగే పర్యవసానం ఆ దేశాన్ని కుదిపేయగలదని భారత్ చేసి చూపించిందని చెప్పారు. ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పామని రాజస్థాన్ వేదికగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.