Shadnagar BJP party (imagecredit:swetcha)
హైదరాబాద్

Shadnagar BJP party: బీజేపీ కార్యాలయం అద్దె చెల్లించక 40 నెలలు.. యజమాని ఆవేదన!

Shadnagar BJP party: షాద్‌నగర్‌లోని బీజేపీ పార్టీ అసెంబ్లీ కార్యాలయానికి గత 40 నెలలుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె చెల్లించాలంటూ పార్టీ నాయకులను నిత్యం వేడుకుంటున్నప్పటికీ నాయకులు స్పందించడం లేదంటూ బిజెపి పార్టీ కార్యాలయ భవన యజమాని రామానుజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. 2022 నుండి 2025 వరకు దాదాపు 40 నెలల అద్దె మొత్తం రూ.10 లక్షలకు చేరిందని కానీ ఇప్పటి వరకు లక్ష యాభై వేలు మాత్రమే చెల్లించారని, మిగతా రూ 8.5 లక్షలు రావాల్సి ఉందని వెంటనే చెల్లించాలని కోరుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశాడు . అద్దె చెల్లించాలంటూ నాయకులను అడుగుతాఉంటే తనకు సంబంధం లేదంటూ తప్పించుకుంటున్నారని పేర్కొన్నాడు.

నేతలను నిలదీసి అడుగుతుంటే నీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అని రీతిలో బెదిరిస్తున్నారని తెలిపారు పార్టీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అంటూ బిజెపి నాయకులను ప్రశ్నించారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపారు. అద్దె కోసం ఎన్నిసార్లు వేడుకున్న నాయకుల స్పందించడం లేదని అన్నారు.

Also Read: Hydraa demolition: పుప్పాల గూడలో అక్రమ కట్టడాలు కూల్చివేత..!

స్థానిక నాయకులు స్పందించి వెంటనే అద్దె బకాయి చెల్లించాలని లేదంటే కుటుంబంతో కలిసి పట్టణ ముఖ్యపుడల్లో నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నియోజకవర్గంలో శ్రీవర్ధన్ రెడ్డి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య వంటి నాయకులు ఉన్నప్పటికీ కార్యాలయ అద్దె చెల్లించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు రోడ్డుపై పడితే పార్టీ పరువు పోతుందని సామాన్య కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

25వేలు మాత్రమే ఇవ్వాలి అందే బాబయ్య

పార్టీ కార్యాలయం భవనం అద్దె బకాయి కేవలం 25 వేలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ అందే బాబయ్య తెలిపారు. కార్యాలయ భవన యజమాని రామాంజనేయులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, నెలకు 11,000 చెల్లిస్తామని మాత్రమే అద్దెకు తీసుకున్నామని, కానీ యజమాని ఎనిమిది లక్షల 50 వేలు బకాయి ఉందని, నెలకు 20 వేలకు పైగా అద్దెకు ఇచ్చినట్లు చెప్పుకోవడం సరికాదని, 25 వేల బకాయి త్వరలోనే చెల్లిస్తామని ఓ వీడియోలో వివరణ ఇచ్చారు.

Also Read: DCM Pawan Kalyan: రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం.. డిప్యూటీ సీఎం!

 

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు