Army Jawan Suicide(image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Army Jawan Suicide: ఆర్మీ యువ జవాన్ ఆత్మహత్య.. కన్నీటి సంద్రంగా మారిన స్వగ్రామం!

Army Jawan Suicide: జమ్ముూకాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న నర్సంపేటకు చెందిన భారత ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేటకు చెందిన సంపంగి మల్లయ్య సరోజన దంపతుల కొడుకు నాగరాజు ఎనమిది సంవత్సరాల క్రితం భారత ఆర్మీ లో జవాన్ గా విధుల్లో చేరాడు. మూడు సంవత్సరాల క్రితం పాలకుర్తి నియోజకవర్గంలోని గ్రామానికి చెందిన ఓ యువతితో నాగరాజుకు మూడేళ్ల కిందట వివాహం అయింది.

Alos Read: Damodar Rajanarsimha: సీఎం పర్యటన విజయవంతం చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం!

మూడు రోజుల కిందట గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా జరుగుతున్న కుటుంబ కలహాలతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు, బంధువులు చర్చించుకుంటున్నారు. నాగరాజు భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. నర్సంపేటకు నాగరాజు మృతదేహం మంగళవారం చేరుకుంది. నిశేష్టుడైన కుమారుడి మృతదేహాన్ని చూసి వృద్ధులైన బోరున విలపించారు. తమకు దిక్కు లేకుండా అయిందని కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. బంధువులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో నర్సంపేటలో ఆర్మీ జవాన్ అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: Kakatiya – Kamal Chandra Bhanj: ఓరుగల్లులో కాకతీయ వారసుని సందడి.. నేను రాజును కాను ఒక సేవకున్ని!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు