Kakatiya – Kamal Chandra Bhanj: రాజు రాజు అంటున్నారు నేను రాజును కాను నేను ఒక సేవకున్ని మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన భారత దేశంలో జన్మను ఇచ్చి భగవంతుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడు. సేవకునిగా ఉన్న వారికే రాజుగా ఎలా ఉండాలో తెలుస్తుంది. రాజు అనేవాడు ప్రజలకు సేవకుడు. అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలతో కూడినదే కాకతీయు సామ్రాజ్యంమని కాకతీయ 22వ వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ అన్నారు. నాటి కాకతీయ సామ్రాజ్యంలో రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లు లో ఆయన మంగళవారం పర్యటించారు. వరంగల్ భద్రకాళిలో అమ్మ వారిని దర్శించుకున్నారు.
అనంతరం హన్మకొండలో వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరస్వామిని, .మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన హరిత కాకతీయ హోటల్ లోని సమావేశ మందిరంలో స్థానికులతో నిర్వహించిన ముఖా ముఖి కార్యక్రమాల్లో మాట్లాడుతూ నేను రాజును కాను 52 శక్తి పీఠాలలో నేను ఒక పూజారిని, సేవకున్ని మాత్రమే నాకు కూడా ఒక కాల పరిమితి ఉంటుంది. మన దేశం ఆదర్శనీయమైన సంసృతి సాంప్రదాయాలు కలిగిన దేశం మనది. ఇది జీవన విధానంలో ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. కానీ ఇది మరిచిపోయి మన పిల్లలను కూడా మనమే పాడు చేస్తున్నాము.
Also Read: Raj Bhavan Theft: రాజ్ భవన్ చోరీ కేసులో భారీ ట్విస్ట్.. ఈ దొంగ మామూలోడు కాదు భయ్యా!
పిల్లలకు హాలిడేస్ వస్తే విజ్ఞాన్ని అందించే మ్యూజియంకు వైజ్ఞానిక ప్రదర్శనలకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతను తెలిపే ప్రదేశాలకు తీసుకువెళ్లాలి. కానీ దానికి విరుద్ధంగా సినిమాలు, రెస్టారెంట్ లు, వండర్ లా వంటి మన సంస్కృతితో సంబంధం లేని విషయాలు పిల్లలకు అలవాటు చేస్తున్నాం. పాశ్చాత్య దేశాలు మన సంస్కృతిని గౌరవిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతిలో పడిపోతున్నాం. ప్రశ్నించడం చాలా సులువు. కానీ ప్రశ్నించిన అంశాలను ఆచరించడం చాలా కష్టమని బంజ్ దేవ్ అన్నారు.
పూరి జగన్నాథ్, ఇలాంటి ప్రదేశాల్లో ధోతి పైసామ్ లు మాత్రమే ధరిస్తారు. అది మన దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాల గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. నీ వేష దారునను బట్టి నువ్వు ఏ దేశానికి చెందిన వాడవు అని గుర్తిస్తారు. నేను విదేశాలలో చదువుకున్నప్పుడు అనేక అంశాలను పరిశీలించాను. అక్కడే విద్యార్థులు నానమ్మా, తాతయ్య, సభ్యులు ఎవరు ఉండరు. లండన్ లో చదివి ఇక్కడికొచ్చాక ఎంతో అవినీతిని ఇక్కడ గమనించాను. నా కల్చర్ తర్వాతే ఎడ్యుకేషన్. ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకొని నువ్వు ప్రపంచానికి ఏమి చేయగలుగుతావో అన్నదాన్ని బట్టి మీ ఎడ్యుకేషన్ స్థాయి నిర్ధారింపబడుతుందన్నారు. వారసత్వ సంపదను సంరక్షించుకోవడమే మన కర్తవ్యం కావాలని కమల్ చంద్ర బంజ్ దేవ్ అన్నారు.
Also Read: RV Karnan: ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి.. అధికారులకు కర్ణన్ కీలక ఆదేశాలు!