Jobs In Hydraa(image credit:X)
హైదరాబాద్

Jobs In Hydraa: హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు.. పోటెత్తిన యువత..

Jobs In Hydraa: హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు యువత పోటెత్తారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు హైడ్రా ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. కేవలం రెండు రోజులే దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడంతో హైడ్రా పార్కింగ్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో యువత బారులు తీరారు.

కాగా 2022 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మెయిన్స్ రాసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులని హైడ్రా ప్రకటించింది. డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు.

సోమవారం భారీ సంఖ్యలో యువత తరలి రావడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది. దీంతో మంగళవారం, బుధవారం కూడా.. మూడు రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.

Also read: Raj Bhavan Theft: రాజ్ భవన్ చోరీ కేసులో భారీ ట్విస్ట్.. ఈ దొంగ మామూలోడు కాదు భయ్యా!

హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, కొద్ది మార్కులతో చేజారిన యువతకు హైడ్రా మరో అవకాశం ఇవ్వడంతో తొలిరోజు 500 పైగా అప్లికేషన్లు వచ్చాయి. వచ్చిన అప్లికేషన్లలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తామని హైడ్రా ప్రకటించింది.

హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను రక్షించడానికి హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను పటిష్టం చేయడానికి సికింద్రాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. హైడ్రా కోసం ప్రత్యేకంగా 55 స్కార్పియో, 21, ట్రక్కులు, 4 ఇన్నోవా కార్లతో పాటు బైక్‌లు ఉన్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు