Tiranga Yatra(image credit:X)
హైదరాబాద్

Tiranga Yatra: తిరంగా యాత్రకు భారీ స్పందన.. తరలి వచ్చిన సెలెబ్రిటీలు..

Tiranga Yatra: పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపై తప్పితే పాకిస్తాన్ తో చర్చలు అనవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన తిరంగా యాత్రను నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. కాగా తిరంగా యాత్రకు భారీ స్పందన వచ్చింది. పార్టీలకతీతంగా నగరవాసులతో పాటు సెలబ్రెటీలు సైతం హాజరయ్యారు. ఆర్మీ రిటైర్డ్ అధికారులు, యువత, విద్యార్థులు, కరాటే విద్యార్థులు, ఎన్ సీసీ కేడెట్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కుమారీస్, విద్యార్థులు, బీజేపీ శ్రేణులు విస్తృతంగా అక్కడికి చేరుకున్నారు. భారత్ మతాకి జై నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి.

Also read: BRS: బీఆర్ఎస్ ఉద్యమబాట.. జిల్లాల పర్యటనలకు శ్రీకారం?

వచ్చిన వారందరితో ట్యాంక్ బాండ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు హాజరై మాట్లాడారు. టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు ఆయన సెల్యూట్ చేశారు. భారత్.. శాంతి కోరుకునే దేశమని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయలేదని వివరించారు. ప్రధాని మోడీ సమయస్ఫూర్తిని మెచ్చుకోవాలని ఆయన కొనియాడారు. పాకిస్తాన్ తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేశామని, కానీ ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు.

మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. తిరంగా యాత్రను పాకిస్తాన్ అధ్యక్షుడు చూసి కలవరాని గురవ్వడం ఖాయమని ఎద్దేవాచేశారు. ప్రధాని మోడీని చూసి టెర్రరిస్టులకు భయం మొదలైందన్నారు. హైదరాబాద్ లో టెర్రరిస్ట్ బ్లాస్ట్ లో బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికీ హైదరాబాద్ లో టెర్రరిస్ట్, స్లీపర్ సెల్స్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఒక్క టెర్రరిస్ట్ లేకుండా తరమివేయాలని కోరారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు అర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని కొనియాడారు. దేశ సైనిక సామర్థ్యం శక్తిని చూసి ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారత్ వైపు చూస్తే పాకిస్తాన్ దేశం మిగలదనేలా ప్రధాని మోడీ సంకేతాలిచ్చారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు దేశం వైపు కన్నెత్తి చూస్తే వారిని వదిలిపెట్టేది లేదనేలా సైనికులు సత్తా చాటారని కొనియాడారు.

ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను డిస్టర్బ్ చేసే కుట్ర జరిగిందని, భారత్ కు తన కాళ్లపై తాను నిలబడే శక్తి ఉందని వివరించారు. ప్రపంచంలో భారత్ ను అజేయ శక్తిగా నిలిపేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కు ఈటల నివాళులర్పించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థ భారత్ వైపు కన్నెత్తి చూసేందుకు భయటపడేలా మోడీ బదులిచ్చారన్నారు.

మాజీ ఎంపీ సినీ నటి జయప్రద మాట్లాడుతూ.. పహల్ గావ్ ఘటన మరిచిపోలేనిదని, మతం అడిగి మరీ చంపారని ఆమె ఆవేదన వ్యక్తంచేశౄరు. భర్తను కోల్పోయిన భార్యకు ఉగ్రవాదులు వెళ్లి మోడీ కి విషయం చెప్పమన్నారని, ఆ విషయం మోడీకి చెప్తే ఏమైందో వారికి అర్థమై ఉంటుందని చురకలంటించారు. ఉగ్రవాదులు బుల్లెట్లు పేలిస్తే మోడీ కంటి చూపుతోనే భస్మం చేశారని కొనియాడారు. సినీ నటి మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తో మోడీ న్యాయం చేశారన్నారు.

Also read: Vishal marriage: విశాల్ పెళ్లి ప్రకటన వచ్చేది ఆరోజే.. వధువు ఎవరో తెలుసా?

స్విఫ్ట్ గా క్విక్ గా మోడీ ఆపరేషన్ సింధూర్ పూర్తి చేశారన్నారు. అధికారి సోఫియా ఖురేషిని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. రక్షణ శాఖ అడ్వైసర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. యుద్ధంలో భారత్ పైచేయి సాధించిందని, వార్ వన్ సైడ్ నడిచిందన్నారు. ఈ యుద్ధంలో స్వేదేశీ ఆయుధాలను వాడినట్లు చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా టెర్రరిస్ట్ క్యాంపులను నాశనం చేశామని తెలిపారు. ఆకాష్ క్షిపణితో పాక్ యుద్ధ విమానాలను నాశనం చేశామని, కరాచీ పోర్ట్ పై దాడి చేశామని తెలిపారు.

బ్రహ్మోస్, ఆకాష్ హైదరాబాద్ లో తయారయ్యాయని, యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా హైదరాబాద్ లో నే తయారైందని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. బయటి శత్రువులను ఎలాగూ గుర్తిస్తామని, భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను గుర్తించాలని ఆయన కోరారు. యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఈ సన్యాసులందరినీ ఒక్క నెల బోర్డర్ లో డ్యూటీ చేయించాలని ఆయన వ్యాఖ్యానించారు.

సైన్యం ఆవేదన వారికి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ గోడం నగేశ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ కుక్కలంటూ ఘాటుగా స్పందించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తామని హెచ్చరించారు. మూడు రోజుల్లోనే పాక్ తోక వంకర చేశామని, ఇది శాంపిల్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా పాక్ ఏకాకిగా అయ్యిందన్నారు. దేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను గుర్తించి వారికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?