The CEO of Farmost Group Died Due To Drowning
అంతర్జాతీయం

USA : యూఎస్‌ఏలో విషాదం, నీట మునిగి ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ సీఈఓ మృతి

The CEO of Farmost Group Died Due To Drowning: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూఎస్‌ఏకి చెందిన రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్‌ మిట్చ్‌ మెక్‌కానెల్‌ బంధువు, ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ సీఈఓ ఏంజెలా చావో డ్రైవింగ్‌ మోడ్‌లో ఉండాల్సిన టెస్లా కారును పొరపాటున రివర్స్‌ మోడ్‌కు మార్చడంతో అది దగ్గరలోని చెరువులోకి అమాంతం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

శుక్రవారం రాత్రి ఆమె తన మిత్రులతో కలిసి టెక్నాస్‌లోని ఆస్టిన్‌ సమీపంలో ఉన్న తన ప్రైవేట్‌ అతిథి గృహానికి వెళ్లారు. 900 ఎకరాల్లో ఈ ఎస్టేట్‌ విస్తరించి ఉంది. మిల్లర్‌ వాగు వారి ఎస్టేట్‌ గుండా ప్రవహిస్తోంది. ఏంజెలా చావో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి, రాత్రిపూట టెస్లా కారులో తన అతిథి గృహానికి బయలుదేరారు.

Read More: దుబాయ్‌ని ముంచెత్తిన వర్షాలు, నదులను తలపిస్తున్న రోడ్లు

మధ్యలో త్రీ పాయింట్‌ మూలమలుపు వచ్చింది. దానిని దాటే క్రమంలో ఏంజెలా కొంత ఖంగారుకు గురై పొరపాటున కారును రివర్స్‌ మోడ్‌లోకి మార్చారు. దాంతో అది వేగంగా వెనక్కి వెళ్లి కొలనులో పడి మునిగిపోయింది.ఏంజెలా భయాందోళనకు గురై స్నేహితురాలికి పోన్‌ చేశారు. వెంటనే గెస్ట్‌ హౌస్‌ మేనేజర్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అద్దాలు చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో వాటిని పగలగొట్టడం సాధ్యం కాలేదు.

చివరికి కారును బయటకు తీసినా అప్పటికే ఏంజెలా తన ప్రాణాలను కోల్పోయారు. ఆమె అమెరికాలో ప్రముఖ బిలియనీర్, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ జిమ్‌ బ్రేయార్‌ సతీమణి. అమెరికా మాజీ రవాణాశాఖ మంత్రి ఎలాయినే చావోకు సోదరి. ఆమె మృతితో అమెరికాలోని పలు కంపెనీల వ్యాపారవేత్తలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!