Medak Crime: ఇటీవలి కాలంలో మనుషులు దారుణంగా తయారైపోతున్నారు. మానవ సంబంధాలను మరిచి.. ఇతరుల మోజులో పడి జీవితం పంచుకోవాల్సిన వారినే కడతేర్చుతున్నారు. నిండు నూరేళ్లు భర్తతో కలిసి సంసారం చేయాల్సిన భార్య, ప్రియుడి మోజులో పడి భర్తను చంపించిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్నభర్తను హత్య చేయించిన ఘటన హవేలీ (మం) షమ్నాపూర్ గ్రామంలో జరిగింది. భర్త శ్రీను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య లత.. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి సుపారి ఇచ్చి హత్య చేయించింది.
ఎవరికీ అనుమానం రాకుండా హత్య అనంతరం తన భర్త కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో కిలాడి భార్య లత ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది లత.
అనేక సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి లతకు ఎంత నచ్చజెప్పినా, పద్ధతి మార్చుకోని లత.. భర్త అడ్డును తొలగించుకోవడానికి మోహన్ అనే వ్యక్తికి 50 వేలు ఇచ్చి భర్తను హతమార్చమని చెప్పింది.
Also read: Case on Bellamkonda: టాలీవుడ్ హీరోకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో కేసు నమోదు!
దీంతో ఎలాగైనా శ్రీనును చంపాలి అనుకున్న మోహన్.. పథకం ప్రకారం గత నెల 16న మద్యం సేవిద్దామంటూ శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి మద్యం తాపిచ్చి బీరు సీసాతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
28వ తేదీన తన భర్త కనిపించడం లేదని లత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తుండగా, లతపై అనుమానం రావడంతో నిలదీయగా తామే హత్య చేశామని లత, ప్రియుడు మల్లేష్ లు అంగీకరించారు.