Case on Bellamkonda: ప్రముఖ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు హైదరాబాద్ పోలీసులు గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇటీవల జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీ వద్ద బెల్లంకొండ శ్రీనివాస్ హల్ చల్ చేశారు. రాంగ్ రూట్ లో కారు నడపడంతో పాటు అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దుసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం బయటకు వచ్చాయి. కానిస్టేబుల్ గట్టిగా నిలదీయడంతో ఏమాత్రం స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. రాంగ్ రూట్ లో కారు నడపడం, అడ్డుకున్న కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించడం వంటి వాటిని ఎఫ్ఐఆర్ లో జోడిస్తూ సంబంధిత సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ కేసుకు సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ ను విచారించే అవకాశముందని అంటున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.
Also Read: Virat Kohli: కోహ్లీని బీసీసీఐ ఇబ్బంది పెట్టిందా? రిటైర్మెంట్ వెనక షాకింగ్ నిజాలు!
ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బెల్లకొండ శ్రీనివాస్.. ఈ రీసెంట్ గా ఓ సినిమాను కంప్లీట్ చేసాడు. నారా రోహిత్, మంచు మనోజ్ తో కలిసి నటించిన ‘భైరవం’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించి టీజర్, ప్రమోషన్ చిత్రాలు.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇది కాకుండా టైసన్ నాయుడు, హైందవ, కిష్కింధపూరి వంటి ప్రాజెక్ట్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు.