Preity Zinta: స్టార్ హీరోయిన్ గురించి ప్రీతి జింతా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తాజాగా ఈమెకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. సినిమాలతో ఎంత ఫేమస్ అయిందో దానికి మించి ఐపీఎల్ లో కూడా అంతే ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం, పంజాబ్ కింగ్స్ ఓనర్ గా కొనసాగుతుంది. సినిమాల నుంచే కాకుండా క్రికెట్ నుంచి కూడా కోట్లు సంపాదిస్తుంది.
Also Read: Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక 24 గంటలు అలా చేసే వాడ్ని.. చనిపోదామనుకున్నా.. డాన్సర్ టోనీ
ఓ నెటిజన్ ప్రీతీ జింతాకి వింత ప్రశ్న వేశాడు. ఆమె లైట్ తీసుకోకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం, ఇండో-పాక్ వార్ కారణంగా దీన్ని వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, మళ్లీ ఈ మే 17 నుండి ఐపీఎల్ స్టార్ట్ అవ్వనుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీతీ జింతాకి ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ చేశాడు. మ్యాక్స్ వెల్ ని మ్యారేజ్ చేసుకుంటే అతను క్రికెట్ బాగా ఆడతాడు ఆమె పేరు పెట్టి ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
Also Read: Tollywood Star Heroine: తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ ఎవరంటే?
అయితే, ఆ కామెంట్ పై విరుచుకుపడిన ప్రీతి జింతా సీరియస్ అయి వెంటనే ఆ నెటిజన్ కి గట్టిగా ఇచ్చి పడేసింది. ” అందర్ని ఇలాగే అడుగుతారా.. మిగతా టీం టీం ఓనర్లను కూడా అడిగే ధైర్యం ఉందా? నేను అమ్మాయిని అనే కదా ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రశ్న నార్మల్ గానే అడిగావ్ కానీ, నీకు నువ్వే ఒకసారి వేసుకో నువ్వు అడిగింది తప్పో ఒప్పో నువ్వే చెప్పు.
18 ఏళ్లుగా ఎన్నో దాచుకుంటూ, దాటుకుంటూ ఈ ప్లేస్ కి చేరుకున్నాను. ముందు నువ్వు ఎదుటి వాళ్ళని ఎలా గౌరవం ఇవ్వాలో నేర్చుకో ” అంటూ ఆ నెటిజన్ కి గట్టిగా ఇచ్చి పడేసింది.
Also Read: Samantha: దాని వలనే నా లైఫ్ నాశనమైంది.. చచ్చిపోదామనుకున్నా.. సమంత సంచలన కామెంట్స్