LRS Extension: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ -2020 కింద వచ్చిన దరఖాస్తుల క్లియరెన్స్ కోసం సర్కారు దరఖాస్తుదారులపై ప్రయోగించిన రాయితీ మంత్రం తుస్సుమన్నది. ఫలితంగా నిధుల కోసం కోసం సర్కారు ఈ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం ముచ్చటగా మూడోసారి రాయితీతో కూడిన గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
దరఖాస్తుదారులను రండి..బాబూ రండి అంటూ మరో సారి చెల్లించాల్సిన మొత్తం ఫీజులో 25 శాతం సర్కారు రాయితీ ఆఫర్ గడువుని పెంచింది. ఈ నెలాఖరు వరకు మలి విడత క్రమబధ్దీకరణ ఫీజులు చెల్లించుకునేందుకు వీలుగా అవకాశం కల్పించింది.
గత ఫిబ్రవరి మాసంలో ఎల్ఆర్ఎస్-2020 స్కీమ్ దరఖాస్తుల క్లియరెన్స్ విషయాన్ని తెరపైకి తెచ్చిన సర్కారు మార్చి నెలాఖరులోపు రాయితీతో కూడిన గడువు విధించింది. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 25.67 దరఖాస్తుల్లో కనీసం ఇరవై శాతం మంది దరఖాస్తులు కూడా మలి విడత ఫీజు చెల్లింపునకు ముందుకు రాకపోవటంతో సర్కారు ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పెంచటం అనివార్యమైంది.
Also read: Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాల కోసం.. రూ.8 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం!
ఈ గడువు లోపు 5 లక్షల 19 వేల మంది ఛార్జీలు చెల్లించారు. ఇప్పటి వరకు కనీసం సగం మంది కూడా ముందుకు రాకపోవటంతో సర్కారు ఈ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం రాయితీతో కూడిన గడువును ఈ నెలాఖరు 31వ తేదీ వరకు వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముందుకు రాకపోవటానికి కారణమేమిటీ?
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు తొలి విడతగా నామమాత్రంగా ఫీజులు చెల్లించినప్పటికీ, మలి దశ ఫీజును చెల్లించేందుకు సర్కారు ఆశించిన స్థాయిలో దరఖాస్తుదారులు ముందుకు రాకపోవటానికి పలు కారణాలున్నాయి.
ఎల్ఆర్ఎస్-2020 స్కీమ్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) రూపకల్పన చేసిన స్టాఫ్ వేర్ లో అనేక రకాల లోపాలు ఏర్పడటంతో పాటు తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తటం, మలి దశ ఫీజు చెల్లింపు క్యాలికులేషన్ సక్రమంగా లేకపోవటం వంటివి కారణాలు కాగా, ఇప్పటి వరకు మలి దశగా ఫీజులు చెల్లించిన చాలా మంది దరఖాస్తులకు క్లియరెన్స్ లు ఇవ్వకపోవటం దరఖాస్తుదారులు ముందుకు రాకపోవటానికి కారణాలుగా చెప్పవచ్చు.
Also read: Ponnam Prabhakar: కొత్త ఆటోలకు నో పర్మిషన్.. ఎక్కడంటే..