Ponnam Prabhakar: హైదరాబాద్ లో కొత్త ఆటో లకు పర్మిట్ ఇవ్వడం లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న పాత ఆటోలకు రెట్రో ఫిటింగ్ ఇంజన్స్ ప్రయత్నం చేయాలని సూచించారు.
ది పార్క్ హోటల్ లో మంగళారం బజాజ్ గోగో లో నూతన ఎలక్ట్రిక్ ఆటోలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గూడ్స్, ప్రయాణికుల వాహనాలు కూడా ఈవీ ఆటోలు వచ్చాయన్నారు. సూపర్ లగ్జరీ ఉండేలా కొత్త ఆటో కి రూపం ఇచ్చారన్నారు.
Also read: HMDA: నిధుల సమీకరణ.. భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ కసరత్తు..
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధి అవకాశాల కోసం రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చిందని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన తరువాత ఆటో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్ నుంచి వెళ్తాయి.. ఆటో లు ఇంటి దగ్గర నుంచి మనం చివరి గమ్యం వరకు వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వాహన సారధి, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిందని వెల్లడించారు.
ఢిల్లీ కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నివాస యోగ్యం లేకుండా పరిస్థితులు మారుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్కడున్న పరిస్థితులు ఇక్కడ రావద్దని తెలంగాణ ప్రభుత్వం 2026 వరకు అమలు అయ్యే విధంగా ఈవీ పాలసీ తీసుకొచ్చిందని స్పష్టం చేశారు.
Also read: Kolikapudi: ఇంతకీ.. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా?
దేశంలోనే మొదటిసారి అన్ని రకాల ఈవీ వాహనాలకు జీరో టాక్స్ చేశామన్నారు. ఆదాయపరంగా నష్టం జరుగుతున్న కాలుష్యం పరంగా నష్టం జరగద్దని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈవీ, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు పెరుగుతున్నాయన్నారు.
ట్రిపుల్ రింగ్ రోడ్డు లోపల ప్రతి వాహనం ఈవీ, సీఎన్జీ, ఎల్పీజీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నవారు. హైదరాబాద్ లో దాదాపు 2800 ఆర్టీసీ బస్సులు ఈవీ చేయాలని ప్రణాళికలు చేస్తున్నామన్నారు.