Kolikapudi Srinivas Issue
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Kolikapudi: ఇంతకీ.. కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా?

Kolikapudi Srinivasa Rao: అవును.. మీరు చదవింది కరెక్టే. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కొలికపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేనా.. ఎంపీనా..? అనేది ఆయనకే క్లారిటీ లేదు. అదేంటి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కదా..? ఈ మధ్యలోనే ఎంపీ ఎప్పుడు అయ్యారబ్బా? అనే కదా మీ సందేహం. ఇదిగో ఆయన రాసిన లెటర్ చూస్తే ఇలాంటి మరెన్నో సందేహాలు మీకు ఆటోమాటిక్‌గా వచ్చేస్తాయంతే. ఇంతకీ ఏం జరిగింది? కొలికపూడి ఎమ్మెల్యేనా? ఎంపీనా? అనే సందేహాలు నివృత్తి కావాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..

తలదూర్చి.. నవ్వులపాలు!
ఇక అసలు విషయానికొస్తే.. కేశినేని బ్రదర్స్ మధ్య లిక్కర్ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి (Kesineni Chinni) ఏపీలో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్‌ నిందితులతో పరిచయాలు ఉన్నాయని, నెలల కిందటే పుట్టిన ఉర్సా కంపెనీ వ్యవహారంలోనూ సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధారాలతో సహా సీఎం చంద్రబాబుకు ఈ మధ్యనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ కూడా రాశారు. తగు చర్యలు తీసుకోవాలని నాని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా నాని.. మీడియా ముందుకొచ్చి చిన్నీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తలదూర్చారు. పాపం.. సెన్సేషనల్ అవుతాను, వార్తల్లో నిలుస్తానని అనుకున్నారేమో కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మీడియా ముందుకొచ్చి అనవసరంగా నవ్వుల పాలయ్యారు. కేశినేని నానిపై పలు ఆరోపణలు చేసిన కొలికపూడి సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ.. లేఖ రాశారు. అయితే ఆ లేఖలో తనను తాను ఎంపీగా (Member Of Parliament) చెప్పుకున్నారు. దీంతో అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆయన ఎమ్మెల్యేనా? ఎంపీనా? గెలిచింది మాత్రం ఎమ్మెల్యేగానే కదా.. ఎంపీ ఎప్పుడు అయ్యారు? అని నెటిజన్లు, విమర్శకులు పెద్ద ఎత్తున ప్రశ్నలు, అంతకుమించి సెటైర్లు వేస్తున్నారు.

Kolikapudi Srinivasa Rao

జస్ట్ ఆస్కింగ్.. ఎవరీ మహానుభావుడు?
తనపై కొలికపూడి చేసిన ఆరోపణలు, విమర్శలపై ఫేస్‌బుక్ వేదికగా కేశినేని స్పందించారు. ‘ ఇంతకీ ఈ మహానుభావుడు ఎమ్మెల్యేనా?.. ఎంపీనా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను నాని పోస్టు చేశారు. అంతేకాదు.. ‘ఇటువంటి (కొలికపూడి) బఫూన్లను ఎన్నుకునందుకు ప్రజలు తలపట్టుకుంటున్నారు!’ అని కూడా కేశినేని పోస్టు చేయడం గమనార్హం. ఈ పోస్టుకు కొలికపూడి మీడియా ముందు చూపించిన లెటర్, కొలికపూడి లేఖను జతచేశారు. ఇందుకు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ మొన్న కేశినేని చిన్ని రాసిన లెటర్‌ను కాపీ చేసి ఈయన పేరు మార్చుకున్నాడు కానీ, హోదా మార్చడం మర్చిపోయాడు.. టైపింగ్ మిస్టేక్’ అని కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ‘ నానీ.. మీ తమ్ముడు లెటర్ ప్యాడ్ మీద కొట్టి పంపించాడు, ఇతను వాడుకున్నాడు. అంత తెలివి ఉంటే ఇతను ఇలా ఎందుకు ఉంటాడు?’ అని సెటైర్ల వర్షం కురిపిన్నారు.

నాని గురించి ఏం మాట్లాడారు?
మంగళవారం కొలికపూడి మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలపై సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాస్తున్నామని తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టారు. గత పదేళ్ళు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు వ్యక్తిగత, వ్యాపార విషయాలు ప్రజలు గమనిస్తారు. మాజీ ఎంపీ కేశినేని నాని.. ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నిపై బురద చల్లే కార్యక్రమం, గుడ్డ కాల్చి మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు. కేశినేని చిన్ని.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెడికల్ క్యాంపులు జాబ్ మేళాలు, అన్న కాంటీన్లు అనేక సేవా కార్యక్రమలు చేశారు. ఇలాంటి వ్యక్తిపై బురద చల్లి లిక్కర్ స్కాంను డైవర్ట్ చేస్తున్నారు. కంపెనీ పెట్టి రుణం తీసుకుని, బ్యాంకుని మోసం చేసి.. కంపెనీ పేరు, డైరెక్టర్లను మార్చేశారు. ఆ ఆదాయాన్ని డైవర్ట్ చేసి ఆంధ్ర క్యాంటీన్ ప్రైవేట్ లిమిటెడ్ అని కూతుర్లని పెట్టి అక్కడ మోసం చేశారు. ఏదో ఒక సంస్థను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు నాని పాల్పడ్డారు. బ్యాంక్ పేరు, బ్యాంక్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ చూపిస్తున్నాం.. గనుక పూర్తిస్థాయి విచారణ జరపాలి. రెండుసార్లు ఎంపీ టికెట్ ఇచ్చిన టీడీపీకి వెన్నుపోడు పొడిచారు. రాజకీయాల్లో లేనంటూనే.. ఒక రాజకీయ అజెండాతో లిక్కర్ స్కాం విషయాన్నీ పక్కదారి పట్టిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఏనాడైనా విజయవాడ అభివృద్ధి గురించి మాట్లాడారా? కేశినేని చిన్ని వెనుకబడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. నానీ.. ఇప్పటికైనా విమర్శలు మాని నైతిక విలువ కాపాడుకోండి. ఇంతకీ మీరు పదేళ్లలో చేసిందేంటి?’ అని కేశినేని నానిని కొలికపూడి ప్రశ్నించారు.

 

Kesineni FB Post

Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!