Komatireddy Rajagopal: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంట్ సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమని, ప్రత్యేక దృష్టితో ఆ నిధులను మంజూరు చేసి పనులను పూర్తయ్యేలా చూడాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ లో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు, విద్యుత్ పనుల అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.
Alos Read: Maoists killed: ఆపరేషన్ కగార్ టర్నింగ్ పాయింట్.. మావోయిస్టులకు భారీ దెబ్బ!
ఈసందర్భంగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీని కలిసి వినతిపత్రం అందజేశారు. రాబోయే కాలంలో నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంట్ ఇచ్చేలా ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాలని, తన సెగ్మెంట్ ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని ముషారఫ్ ఫరూఖీని రాజగోపాల్ రెడ్డి కోరారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు