Crime News( image creit: free pic)
క్రైమ్

Crime News: పట్టపగలే హత్య.. ప్లాన్‌ చేసి హతమార్చిన నిందితులు!

Crime News: వ్యాపారంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో చంపేస్తానని బెదిరించాడని వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన అయిదుగురిని పేట్​ బషీరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రెండు కత్తులు, మోటార్​ సైకిల్​, రక్తం మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్​ జోన్​ డీసీపీ కోటి రెడ్డి పేట్​ బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మేడ్చల్​ ప్రభుత్వ బాలుర స్కూల్ ప్రాంతంలో నివాసముంటున్న సయ్యద్​ సిద్దిఖీ (38)ని కొంపల్లి సెంట్రల్ పార్క్​ వద్ద వారాంతపు మార్కెట్​లో పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పేట్​ బషీరాబాద్​ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే హత్యకు పాల్పడ్డ మచ్చబొల్లారం నివాసులు షేక్​ అహమద్​ (33), షేక్​ రహమత్​ (24), శశికుమార్​ (23), వాగ్మార్​ రాజు కమల్ (24)తోపాటు ఓల్డ్​ అల్వాల్​ కు చెందిన వరికుప్పల జంపన్న (20)ను అరెస్ట్ చేశారు.

Cyber Criminals Arrest: సైబర్ కేటుగాళ్లకు బ్యాండ్ బాజా.. రూ.4.37 కోట్లు వెనక్కి!

చంపేస్తానని బెదిరించటంతో…
విచారణలో వ్యాపార విభేదాల నేపథ్యంలో తనను చంపేస్తానని సయ్యద్​ సిద్దిఖీ బెదిరించటంతో సహచరులతో కలిసి ఈ హత్య చేసినట్టుగా షేక్​ అహమద్​ వెల్లడించాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగే వారాంతపు మార్కెట్లకు తాను లైట్లను సరఫరా చేస్తుంటానన్నాడు. సయ్యద్ సిద్దిఖీ కూడా ఇదే వ్యాపారం చేసేవాడని చెప్పాడు. ఈ క్రమంలో తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపాడు. మార్చి నెలలో సయ్యద్​ సిద్దిఖీ మేడ్చల్ వీక్లీ మార్కెట్​ లో తనపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినట్టు వెల్లడించాడు.

ఈ మేరకు తాను ఫిర్యాదు చేయగా పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపాడు. ఈ కేసులను ఉపసంహరించుకోవాలని సయ్యద్​ సిద్దిఖీ తనను బెదిరించాడని చెప్పాడు. లేనిపక్షంలో తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని భయపెట్టాడని తెలిపాడు. ఈ క్రమంలో ఎప్పటికైనా అతని నుంచి ప్రమాదమే అని భావించి సహచరులతో కలిసి సయ్యద్ సిద్దిఖీని పథకం ప్రకారం హత్య చేసినట్టుగా వెల్లడించాడు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్​ చేసిన పేట్​ బషీరాబాద్​ పోలీసులను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు