Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు వాయిద్య కారులతో కలిసి నృత్యం చేసి అందరిని ఉత్సాహపరచారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు, బోనాలు నేడు వైశాఖ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Also Read: Minister Seethakka: హామీలపై కట్టుబాటు.. ములుగు ప్రజలకు.. మంత్రి భరోసా!
మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్నారు. హుస్నాబాద్ నాయకులు, ప్రజలంతా వచ్చే భక్తులకు ఆతిధ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలనీ, కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మకు చరిత్ర ఉందన్నారు.
ఉత్సవాల్లో బోనాలు ,పట్నాలు , ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారనీ, అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెల రోజులపాటు కొనసాగుతాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు