PoK Terror Camps: ఆపరేషన్ సిందూర్ పై త్రివిద దళాల అధికారులు తాజాగా మరో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ పై జరిపిన దాడులకు సంబంధించి మరిన్ని సమగ్ర విషయాలు పంచుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’లో భాగంగా మే 7న చేసిన వైమానిక దాడుల్లో ఉగ్రవాదుల స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులపైనే తమ పోరు అన్న సైన్యం.. దాడులకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
త్రివిద దళాల సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టి నెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఎ.కె భారతి, నావీ వైస్ అడ్మిరల్ ఏ.ఎన్. ప్రమోద్ సంయుక్తంగా పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయన్న భారత సైన్యాధికారులు.. ముష్కరులపై భారత్ జరిపిన పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని పేర్కొన్నారు. దీంతో భారత సైన్యం దీటుగా జవాబు ఇచ్చిందని చెప్పారు. పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని స్పష్టం చేశారు.
ఎయిర్ మార్షల్ ఎ.కె భారతి మాట్లాడుతూ.. పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలు భారత వాయుసేన ధ్వంసం చేసిందని తెలిపారు. పీవోకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయినట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత్ యుద్ధం చేసిందన్న ఎయిర్ మార్షల్.. అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్‌లను తిప్పికొట్టామన్నారు. దేశీయ టెక్నాలజీ రూపొందిన ఆకాశ్‌ను ఈ ఆపరేషన్‌లో సమర్థంగా వినియోగించామని అన్నారు. చైనా తయారు చేసిన పీఎల్-15 క్షిపణిని సైతం నేలకూల్చినట్లు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన అనేక డ్రోన్లు, మిసైళ్లను కూల్చివేసినట్లు పునురుద్ఘాటించారు. అనంతరం పాక్ లోని నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ లపై దాడి దృశ్యాలను ప్రదర్శించారు.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. వాటిలో తెలంగాణనే నెం.1.. సీఎం వెల్లడి
మరోవైపు వైస్ అడ్మిరల్ ప్రమోద్ మాట్లాడుతూ.. భారత్ వైపు గగనతల దాడులను వెంటనే గుర్తించి నిలువరించినట్లు చెప్పారు. పాక్ డ్రోన్లు, మిసైళ్లు ఎదుర్కొనేందుకు ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ ను సమర్థవంతంగా వినియోగించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ లోని ఉగ్రస్థావరాలు, ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసేందుకు డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. వందల కి.మీ దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నట్లు వైస్ అడ్మిరల్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ త్రివిద దళాలు సమన్వయంతో పని చేశాయని.. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉందని అన్నారు.