Saraswati Pushkaralu: పవిత్ర పుణ్య క్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో ఈ నెల 15 నుంచి నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు తిప్పలు తప్పేట్లు లేవని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆయన కాళేశ్వరంలోని త్రివేణి సంగమం సమీపంలోని సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల అభివృద్ధికి కోట్ల రూపాయలను మంజూరు చేసినప్పటికీ పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. పనుల నిర్వహణలో అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!
ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న శైలజ రామయ్యర్ లు ఇద్దరూ కలిసి పర్యవేక్షించినప్పటికీ పనులు ఏ ఒక్కటి పూర్తి కాలేదన్నారు. అన్ని పనులు అసంపూర్తిగానే ఉండడం చూస్తే పుష్కరాలకు వచ్చే భక్తులకు తిప్పలు తప్పేట్లు లేవని విడ్డూరమన్నారు. ఏ పని పూర్తి కాకున్నా అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పడం విడ్డూరం అన్నారు.
పూర్తిస్థాయిలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి సరస్వతి పుష్కరాలను నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడితే అధికారులను అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పనుల నిర్వహణకు సంబంధించి అధికారులకు ఫోన్ చేసి మాజీ ఎమ్మెల్యే మాటలాడు. ఇప్పటికైన పనులు వేగవంతం చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు