Mega Health Camp: మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో ఆర్ఎంపి, పి.ఎం.పి, బిగ్ టీవీ మరియు శ్రీకార హాస్పిటల్ కొంపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ కమిషనరేట్ అడిషనల్ డిసిపి ఎస్ ఓ టి డాక్టర్ నంద్యాల నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియం చేసుకోవాలని ఇట్టి కార్యక్రమాన్ని ముందుండి ఆర్ఎంపి, పిఎంపి, బిగ్ టీవీ, శ్రీకార హాస్పిటల్ కొంపల్లి వారిని అభినందించారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
Also Read: GHMC on Rains: బీ అలర్ట్ ఐఎండీ హెచ్చరికలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ!
ఈ కార్యక్రమంలోఇన్చార్జి ఎస్ఐలు సృజన, నారాయణ, ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, గ్రామస్తులు ముత్యం రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అక్క పల్లి రామ్ రెడ్డి, బాజా రమేష్, శ్రీకర హాస్పిటల్ జనరల్ మేనేజర్ రవికుమార్, డిఎంఓ డాక్టర్ లతా, డాక్టర్ తేజ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ రమేష్ ఆర్ఎంపీ, పీఎంపీల అధ్యక్షులు బైరవరెడ్డి, కార్యవర్గ సభ్యులు, బాలరాజ్, శేఖర్, రాజు, కిషన్, అంజిరెడ్డి, కిషన్, తదితరులు పాల్గొన్నారు.