Kesineni Nani: కేశినేని బ్రదర్స్ మధ్య ఫైట్ మరింత ముదిరింది. ఇన్నాళ్లు విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లకే పరిమితమైన కేశినేని నాని, కేశినేని చిన్నీల వ్యవహారం ఇప్పుడిక ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాకా చేరుకున్నది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం గురించి మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన విషయాలను వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి సీఎం చంద్రబాబాబుకు సైతం రెండుసార్లు లేఖ రాసి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం.. సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ తనను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కన్నెర్రజేసిన నాని ఈసారి ఏకంగా ఈడీకి లేఖ రాశారు. ఏపీ మద్యం కుంభకోణంలో ఎంపీ కేశినేని శివనాథ్, సహచరుల పాత్రపై ఈడీ దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేస్తూ లేఖలో పలు విషయాలను నిశితంగా వివరించారు.
Read Also- Murali Naik: జవాన్ పాడె మోసిన లోకేష్.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన
ఈ ఆరోపణల సంగతి చూడండి..
‘ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో భారీ స్థాయిలో జరిగిన మనీ లాండరింగ్‌కు సంబంధించి ఎఫ్ఐఆర్ నెం. 21/2024 తేదీ 23.09.2024 కింద జరుగుతున్న దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ. మీరు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నెం. 21/2024 తేదీ 23.09.2024 ఆధారంగా ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారికంగా కోరిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో, మీరు వెంటనే దృష్టి సారించాల్సిన ఒక కీలక కోణాన్ని ఈ లేఖ ద్వారా హైలైట్ చేయాలనుకుంటున్నాను. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)పై, విజయవాడ నుంచి పార్లమెంట్ సభ్యుడైన కేశినేని శివనాథ్ (చిన్నీ)కి నమ్మకం లేనందున సీబీఐ (CBI) దర్యాప్తు కోరుతూ అధికారికంగా విజ్ఞప్తి చేశారు. అయితే, వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలలో ఆయన స్వయంగా పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆందోళనకరంగా మరియు సూచనాత్మకంగా ఉంది, ఇది లోతైన పరిశీలనకు అర్హమైనది’ అని లేఖలో నాని నిశితంగా రాసుకొచ్చారు.
Read Also- Naga Babu: నాగబాబు మంత్రి అవుతారా.. లేదా? డేంజర్ జోన్‌లో ఉన్నదెవరు?
బలమైన కారణాలు..
‘ అధికారిక రికార్డులు, పబ్లిక్ డొమైన్ డేటా ప్రకారం, కేశినేని శివనాథ్, ఆయన భార్య జానకీ లక్ష్మి.. రాజ్ కసిరెడ్డి ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్‌పీ (Pryde Infracon LLP) తో పాటు ఇతర వ్యాపారాలలో భాగస్వాములు. ఈ సంస్థలు నేర ప్రాసీడ్స్‌ను ఛానెల్ చేయడానికి ఉపయోగించబడి ఉండవచ్చు, ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 ఉల్లంఘణలోకి రావొచ్చు. అంతేకాక, మనీ లాండరింగ్ ట్రయిల్, భారతదేశంలో.. విదేశాల్లో బహుళ కంపెనీలు, ఎల్ఎల్‌పీలలో విస్తరించి ఉందని, ఇందులో కేశినేని శివనాథ్ యొక్క కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు.. దీర్ఘకాల వ్యాపార భాగస్వాములు ఉన్నారని నమ్మడానికి బలమైన కారణాలు ఉన్నాయి’ అని లేఖలో నాని పేర్కొన్నారు.
Read Also-Kesineni Nani: చిన్నిపై ‘లిక్కర్’ బాంబ్ పేల్చిన కేశినేని నాని.. సీఎం చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటో?
ఈ అంశాలను చేర్చండి..
‘ పైన పేర్కొన్న వ్యక్తులతో సంబంధం ఉన్న భారతదేశంలో, విదేశాలలోని అన్ని కంపెనీలు, ఎల్ఎల్‌పీలు, ట్రస్ట్ స్ట్రక్చర్‌లు. వీరితో సంభవించే సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ కంపెనీలు. ఏదైనా షెల్ ఎంటిటీలు, బేనామీ హోల్డింగ్‌లు లేదా సర్క్యులర్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్‌లు. క్రాస్-బోర్డర్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, విదేశీ ఆస్తులు మరియు బహిర్గతం కాని విదేశీ పెట్టుబడులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశినేని శివనాథ్, అతని వ్యాపార భాగస్వాములలో కొంతమంది వ్యక్తులు రూ.2వేల కోట్ల చైన్-లింక్ కుంభకోణంతో కూడా సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది FIR నం. 266/2023 తేదీ 16/09/23 కింద హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉంది. ఆర్థిక నెట్‌వర్క్‌లలో ఒకే విధమైన అతివ్యాప్తి ఉన్నందున, భారీ ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ కేసులో వారి పాత్రలను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిశీలించాలని కోరుతున్నాను. ఈ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించబడిన ఆర్థిక కార్యకలాపాల లోతు, విస్తృతి, మద్యం కుంభకోణం యొక్క నేర ప్రాసీడ్స్‌ను లాండరింగ్ చేయడానికి ఒక పెద్ద మెకానిజం ఉందని బలంగా సూచిస్తుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా నిష్పాక్షికమైన, వివరణాత్మక దర్యాప్తు పూర్తి సత్యాన్ని బయటపెట్టడానికి, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అవసరం’ అని లేఖలో నాని వెల్లడించారు. ఇన్నాళ్లు కేంద్ర దర్యాప్తు సంస్థల జోలికి వెళ్లలేదు. ఇప్పుడిక ఏకంగా ఈడీకి మాజీ ఎంపీ లేఖ రాయడంతో.. చిన్నీ పనైపోయినట్టేనా? అని విజయవాడలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ లేఖపై ఈడీ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
I have formally written to the Enforcement Directorate @dir_ed urging them to investigate MP,Vijayawada, Kesineni Sivanath (Chinni) @KesineniS his business partner Raj Kasireddy, and their network of associates for their alleged involvement in the AP liquor scam and money… pic.twitter.com/HqGw3Nut4Z
— Kesineni Nani (@kesineni_nani) May 11, 2025