Sneha Shabarish: గ్రేటర్ వాసులకు అభివృద్దితో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీకి ఇటీవలే కమిషనర్ గా వచ్చిన ఆర్. వి. కర్ణన్ తనదైన మార్కు పాలనను మొదలుపెట్టారు. ఇప్పటి వరకు మెటర్నిరీ లీవ్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్నేహా శబరిష్ 180 రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరారు.
గతంలో ఐటీ, రెవెన్యూ శాఖలకు అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు కమిషనర్ అడ్వర్ టైజ్ మెంట్ విభాగానికి అదనపు కమిషనర్ బాధ్యతలను అప్పగించటంతో పాటు అర్బన్ బయోడైవర్శిటీకి అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సుభద్రాదేవిని విధుల నుంచి తప్పించి, యూబీడీ ఇన్ ఛార్జి అదనపు కమిషనర్ గా నియమించారు.
అడ్వర్ టైజ్ మెంట్ విభాగం అదనపు కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించిన వేణుగోపాల్ రెడ్డికి ట్రాఫిక్, స్ట్రీట్ లైట్ల విభాగాలను అప్పగించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు కు సంబంధించిన అన్ని ఫైళ్లు అదనపు కమిషనర్ ద్వారానే వెళ్లాలని కూడా కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Also read: Kavitha On Revanth: హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు.. సీఎం రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ డిమాండ్!