Ganja Seized (imagecredit:AI)
క్రైమ్

Ganja Seized: తెలంగాణలో నేపాలీల గంజాయి దందా.. ఇద్దరు అరెస్ట్!

Ganja Seized: ఉపాధి కోసం వచ్చి గంజాయి దందా చేస్తున్న ఇద్దరు నేపాలీలను ఎక్సయిజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్, ప్రొహిబిషన్​ డైరెక్టర్​ షానవాజ్​ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్​ దేశానికి చెందిన సూర్య సింగ్​, రమేశ్​ బహదూర్‌లు కొంతకాలం క్రితం బతుకుదెరువును వెతుక్కుంటూ హైదరాబాద్​ వచ్చారు. సంతోష్​ నగర్​ ప్రాంతంలోని ఈదీబజార్‌లో నివాసముంటున్నారు.

కాగా, తేలికగా డబ్బు సంపాదించటానికి ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా గంజాయి అమ్మటం మొదలు పెట్టారు. ధూల్ పేటకు చెందిన అభిషేక్ సింగ్​ అనే పెడ్లర్​ నుంచి గంజాయి కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని అమ్ముతున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన స్టేట్ టాస్క్​ ఫోర్స్​సీఐ నరేందర్, ఎస్సైలు సుజాత, శివచరణ్​ తోపాటు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేందర్, ప్రసాద్, శంకర్, విక్రమ్‌లతో కలిసి దాడి చేసి ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి మలక్​ పేట ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు.

75కిలోల గంజాయి సీజ్

డ్రగ్స్ కు చెక్​ పెట్టటానికి ఎక్సయిజ్​, ప్రొహిబిషన్ అధికారులు ఈనెల 8 నుంచి స్పెషల్​ డ్రైవ్​ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గంజాయి రవాణాపై అధికారులు ప్రత్యేక దృష్ఠిని సారించారు. ఇందులో భాగంగా అసిస్టెంట్​ ఎక్సయిజ్ సూపరిండింటెంట్​ తిరుపతి, సీఐ రమేశ్, హెడ్​ కానిస్టేబుళ్లు కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, హరీష్, విజయ్, హనుమంతులు భద్రాచలంలోని గోదావరి ఇసుక ర్యాంప్​ సమీపంలో తనిఖీలు చేపట్టారు.

Also Read: Bhatti Vikramarka: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం మీకోసమే!

ఆ సమయంలో అటుగా వెళుతున్న కారును ఆపి సోదా చేయగా 75 కిలోల గంజాయి దొరికింది. విచారణలో దీనిని ఒడిషా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్టు వెల్లడైంది. గంజాయి స్మగుల్ చేస్తున్న అనిల్ కుమార్​ శర్మ, ముఖేశ్​ కుమార్​ దేవ్​ లను అరెస్ట్​ చేశారు. పాల్వంచకు చెందిన దుర్గప్రసాద్​ గంజాయి సరఫరా చేసినట్టు తెలియటంతో అతనిపై కూడా కేసులు నమోదు చేశారు.

20.6 కిలోల గంజాయి స్వాధీనం

కంపెనీ ఆపరేటర్‌గా చేస్తున్న ఉద్యోగంలో ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో గంజాయి పెడ్లర్‌గా మారిన వ్యక్తిని ఎక్సయిజ్​ స్టేట్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి 10 లక్షల విలువ చేసే 20.6 కిలోల గంజాయిని సీజ్​ చేశారు. జలీలుద్దీన్​ అహమద్​ సిద్దిఖీ మహారాష్ట్ర ఔరంగాబాద్​ నివాసి. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. తేలికగా డబ్బు సంపాదించటానికి కొంతకాలంగా గంజాయి దందా మొదలు పెట్టాడు.

సీలేరు నుంచి గంజాయి కొని మహారాష్ట్రకు స్మగుల్​ చేస్తూ అమ్ముతున్నాడు. ఎప్పటిలానే ఈసారి కూడా కారులో సీలేరు వెళ్లి 2‌‌‌‌0.6 కిలోల గంజాయి కొని మహారాష్ట్రకు వెళుతుండగా సంగారెడ్డి పొతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్​ మెంట్​ వద్ద సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. సీలేరుకు చెందిన లక్ష్మీబాయ, కృష్ణలు ఇతనికి గంజాయి అమ్మినట్టుగా తెలియటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు.

Also Read: S-400 Sudarshan Chakra: రంగంలోకి ఎస్-400.. ఇక భారత్ సేఫ్.. పాక్‌కు మాత్రం చుక్కలే!

 

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?