Special Drive on Drugs (imagecredit:swetcha)
క్రైమ్

Special Drive on Drugs: భద్రాచలం ప్రాంతంలో భారీ గంజాయి పట్టివేత..!

Special Drive on Drugs: గంజాయి డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనిలో భాగంగానే, భద్రాచలం ప్రాంతంలోని గోదావరి ఇసుక ర్యాంప్ సమీపంలో అనుమానంగా వెళుతున్నటువంటి ఓ కారును పోలీసులు తనిఖీలు నిర్వహించగా అందులో 75 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి రాజస్థాన్‌కు అక్రమంగా తరలిపోతున్న ఈ గంజాయిని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గంజాయి మరియు కారుతో కలిపి రూ. 41 లక్ష విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: Prabhas Marriage: వాళ్లని సీక్రెట్ గా కలిసిన ప్రభాస్.. పెళ్లి కోసమేనా.. గుడ్ న్యూస్ పక్కానా?

గంజాయిని తీసుకు వెళుతున్నటువంటి రాజస్థాన్‌కు చెందిన అనిల్ కుమార్ శర్మ ముఖేష్ కుమార్ దేవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా పాల్వంచకు చెందిన దుర్గాప్రసాద్ గంజాయి సరఫరా చేశాడని నిందితుల విచారణలో పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఐఏఎస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఐపీఎస్, ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్ లో భాగంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి మరియు అసిస్టెంట్ కమిషనర్ గణేష్ లు గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీంను అభినందించారు.

Also Read: Srinidhi Shetty: నా జీవితం అక్కడితో ముగిసిపోయిందంటూ సంచలన కామెంట్స్ చేసిన శ్రీనిధి శెట్టి

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!