Operation Sindoor: బిగ్ బ్రేకింగ్.. ఆపరేషన్ సింధూర్ 2.0
Operation Sindoor (image Source: AI)
జాతీయం

Operation Sindoor: బిగ్ బ్రేకింగ్.. ఆపరేషన్ సింధూర్ 2.0.. రెండోరోజు పాక్‌కు చుక్కలు

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత దయాది పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోయింది. గురువారం భారత్ (India) పై ప్రతీకార దాడులకు యత్నించింది. దీంతో సమయోచితంగా వ్యవహరించిన భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే లాహోర్ (Lahor) లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సైతం భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడులకు సంబంధించి ఢిల్లీలో విదేశాంగ శాఖ, భద్రతా బలగాలు సంయుక్తం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అవంతి పొరా, శ్రీనగర్, జమ్ము, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తల, జలందర్, లూథియానా తదితర 17 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించినట్లు తెలిపాయి. ఈ దాడుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ దాడులకు తెగబడగా, భద్రతా బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో మిస్సైల్స్ శిథిలాలు అనేక చోట్ల పడ్డాయని తెలిపారు. పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో తాము కూడా అలాగే చేశామని స్పష్టం చేశారు. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేశామని తెలిపారు. సరిహద్దుల్లో దాడులను పెంచిన పాక్,
మోర్టార్లు, బాంబులు ఉపయోగిస్తున్నదని వివరించారు.

Read Also- Karregutta: కర్రెగుట్టలో మావోయిస్టుల ఎదురు కాల్పులు.. తెలంగాణ పోలీసుల మృతి!

పాకిస్థాన్ పుట్టుకతోనే అబద్ధాలు పుట్టాయని అధికారులు వెల్లడించారు. చివరకు ఐక్యరాజ్యసమితిలోనూ అబద్ధాలు చెబుతున్నదని మండిపడ్డారు. మరింత కవ్వింపు చర్యలకు దిగితే స్పందన కూడా అదే రీతిలో ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని, సెక్యూరిటీ కౌన్సిల్‌లో టీఆర్ఎఫ్ రద్దును పాక్ వ్యతిరేకించిందని తెలిపారు. పహల్గామ్ దాడులకు పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా కూడా ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని పాక్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక దాడుల్లో పాక్ ప్రమేయం ఉన్నదని రుజువైందని అధికారులు తెలిపారు. ప్రపంచంలో జరిగిన అనేక దాడుల్లో పాక్ ప్రమేయం ఉన్నదన్నారు. ఆ దేశం దశాబ్దాలుగా భారత్‌లోకి ఉగ్రవాదాన్ని పంపుతున్నదని, అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నదని వివరించారు. అంతర్జాతీయంగా పాక్ ట్రాక్ రికార్డ్ వరస్ట్‌గా ఉందన్న అధికారులు, ముంబై దాడుల రుజువులను భారత్ అందించిందని గుర్తు చేశారు. అప్పుడు భారత్ ప్రయత్నాలకు అడ్డు పడుతూ వచ్చిందన్నారు. పఠాన్‌కోట్ దాడుల సమయంలో విచారణకు పాక్ బృందానికి అనుమతించామని, ఉగ్రవాదుల డీఎన్ఏ, రికార్డులు, వాళ్ల అడ్రస్‌లు కూడా అందించామని వివరించారు. భారత్‌లోని గురుద్వారాలపై పాక్ దాడి చేసిందని, ఆ దాడిలో ముగ్గురు సిక్కులు చనిపోయారని తెలిపారు. ఇంత జరిగినా తప్పుడు సమాచారంతో పాకిస్థాన్ మతం రంగు పులుముతున్నదని ఫైరయ్యారు. పాక్ సైన్యాధ్యక్షుడి మాటలు, పహల్గామ్ దాడులకు సంబంధం ఉందని, పహల్గామ్ దాడులతో కవ్వింపు చర్యలకు దిగిందని మండిపడ్డారు. అందుకే, భారత్ స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

Also Read: IND Neutralizes PAK Missile: బరితెగించిన పాక్.. భారత్ పైకి మిసైళ్లు.. బుద్ధిచెప్పిన సైన్యం!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క