Karregutta (imagecredit:swetcha)
తెలంగాణ

Karregutta: కర్రెగుట్టలో మావోయిస్టుల ఎదురు కాల్పులు.. తెలంగాణ పోలీసుల మృతి!

Karregutta: కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ రణరంగంగా మారింది. మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ-బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలు హతమయ్యారు. చత్తీస్గడ్ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 17 రోజులుగా భద్రతా బలగాలు కొనసాగిస్తున్న కూంబింగ్ లో గురువారం అటు మావోయిస్టులకు, ఇటు భద్రతా బలగాలకు చాలా నష్టం వాటిల్లింది. సాయంత్రం కర్రెగుట్టల ప్రాంతంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు పదిమందితో కూడిన మావోయిస్టులు తారసపడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.

పదిమంది కీలక నేతలు హతం

కర్రెగుట్టల ప్రాంతంలోని చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్ లంకపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు(సి సి ఎం) చంద్రన్న, ఎస్ డబ్ల్యూ జెడ్ సి ఎం బండి ప్రకాష్ తోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ సైతం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు మరో ఏడుగురు కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదుర్కాల్పుల్లో మృత్యువాత చెందినట్టుగా సమాచారం. అయితే అధికారికంగా సీఆర్పీఎఫ్ ఏ డి జి వివేకానంద సిన్హా వెల్లడించాల్సి ఉంది.

చంద్రన్న మావోయిస్టుల్లో కీలక నేత

కేంద్ర కమిటీ మెంబర్ చంద్రన్న మావోయిస్టుల్లో కీలక నేతగా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి నాయకత్వంలో చంద్రన్న నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శి దామోదర్ కీలక భూమిక పోషిస్తున్నారు. కర్రెగుటల్లో ఉన్న గుహలు చంద్రన్న ఆధ్వర్యంలోనే ఆపరేషన్ అంతా సాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రన్న కూడా గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృత్యువాత చెందినట్లుగా సమాచారం.

Also Read: Seethakka: కోతలు లేని జీతం.. ఉపాధి హామీ సిబ్బందికి మంత్రి హామీ!

ఆపరేషన్ కగార్ కు తెలంగాణకు సంబంధం లేదు

కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర బలగాలతో గత 17 రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో నిర్వహిస్తున్న కూంబింగ్లలో తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఎటువంటి సంబంధం లేదని ఈ మధ్యకాలంలో తెలంగాణ నేతలు, మంత్రి సీతక్క తో పాటు ఓ మీడియా చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చెప్పిన విషయం విదితమే. తాజాగా గురువారం జరిగిన ఎన్కౌంటర్ సమయంలో ల్యాండ్ మైన్స్ పేలడంతో తెలంగాణ ఆర్ఎస్ఐ రణధీర్ కానిస్టేబుల్స్ పవన్ కళ్యాణ్ సందీప్ తో పాటు మరో ఇద్దరు కలిపి మొత్తం ఐదుగురు మృతి చెందినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది.

మృతిచెందిన పోలీసులను వరంగల్‌కు తరలింపు

తెలంగాణ – ఛత్తీస్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలం లంకపెల్లి అడవుల్లో మందుపాతర పేలి మృతి చెందిన ముగ్గురు ఎస్సై రణధీర్, కానిస్టేబుళ్లు సందీప్, పవన్ కల్యాణ్ మృతదేహాలు అంబులెన్స్ ద్వారా పోలీస్ శాఖ అధికారులు వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతి చెందిన పోలీసులకు డిజిపి జితేందర్ మరియు గ్రేహౌండ్స్ డిజి స్టీఫెన్ రవీంద్ర. నివాళులు అర్పించారు. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయిన తరువాత మృత దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. పోలీసుల మృత దేహాలు వరంగల్ ఎంజీఎం కు తరలించడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Also Read: Hydra: నేడు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..

వరంగల్‌కు డీజీపీ జితేందర్ చేరుకున్నారు. గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర MGM మార్చురీలో ముగ్గురు గ్రేహౌండ్స్ సిబ్బంది మృత దేహాలకు పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచారు. మరికొద్దిసేపట్లో మృతదేహాలను డీజీపీ సందర్శించనున్నారు. గ్రేహౌండ్స్ డీజీ మృతిచెందిన ముగ్గురూ పోలీసులను శ్రీధర్, సందీప్, పవన్ కల్యాణ్ అనే జవాన్లుగా గుర్తించారు. కాల్పల్లో గాయపడ్డ RSI రణధీర్‌ది వరంగల్ మండలం పైడిపల్లి గ్రామం చెందిన పోలీస్ రణధీర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

మావోయిస్టు కీలక నేత జగన్ మృతి

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత జగన్ ఉన్నట్లు సమాచారం. జగన్ పై రూ. 20 లక్షల రివార్డు ఉంది. అల్లూరి జిల్లా వై రామవరం జికే వీధి మండలాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టు ఎదురుపడగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జగన్ తో పాటు మరో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. వారి నుంచి రెండు ఏకే 47 లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు.. గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వం ఫోకస్..

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?