Maoists Surrendered: సరెండర్ కం రిహాబిలిటేషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పోరు కన్నా…ఊరు మిన్న కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరిష్ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ తెలిపిన వివరాల ప్రకారం… నిషేధిత మావోయిస్టు పార్టీలో గత కొంతకాలంగా పనిచేస్తున్న కోమటిపల్లి ఆర్పిసి సభ్యుడు మడావి బీమా, కోమటిపల్లి ఆర్పిసి జంగిల్ శాఖ సభ్యుడు మడావి కోస, కోమటిపల్లి ఆర్పిసి డీకే ఏ ఎం ఎస్ సభ్యుడు మడివి భీమా, కోమటిపల్లి ఆర్పిసి సభ్యుడు వంజం ఊర, కోమటిపల్లి ఆర్పిసి చైతన్య నాట్య మండలి సభ్యురాలు వంజం హుంగి లు అగ్ర నాయకుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో అనేక నేరపూరిత ఘటనల్లో పాల్గొన్నారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. తెలంగాణలో భద్రతా చర్యలపై.. ముఖ్యమంత్రి సమీక్ష!
2025 జనవరి నుండి నేటి వరకు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న నిషేధిత సిపిఐ మావోయిస్టులు డివిజన్ కమిటీ సభ్యురాలు 01, ఏరియా కమిటీ సభ్యులు 06, పార్టీ సభ్యులు 11, మావోయిస్టు పార్టీకి చెందిన జనతన్ సర్కారులో వివిధ సంఘాల నుండి మిలిషియా, ఆర్పిసి, సిఎన్ఎం, డి ఏ కే ఎం ఎస్ లలో పనిచేసిన 28 మంది సభ్యులు, సహా మొత్తం 47 మంది ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో జీవితం సాగిస్తున్నారు.
వారందరికీ భారతదేశంలోనే అత్యుత్తమమైన సరెండర్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. వారి వారి మీద ప్రకటించబడిన రివార్డు డబ్బులను లొంగిపోయిన 24 గంటల్లోనే బ్యాంకులో డిడి ద్వారా అందజేస్తున్నాం.
ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే తగు వైద్య చికిత్స చేయించడంతోపాటు పూర్తి స్థాయిలో నయమయ్యే విధంగా కృషి చేస్తున్నాం. వారి పునరావాసానికి తగు విధంగా ప్రభుత్వం నుండి సహాయం అందించడంతోపాటు తోడ్పాటును సైతం అందిస్తున్నాం. నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారి పునరావాసం, ఇతర బాగోగుల విషయంలో పోలీసు శాఖ వారికి అండగా ఉంటుందని ఎస్పీ శబరిష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి ఎం రవీందర్ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు