Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో యువకులు ఫిర్యాదు చేశారు. ముస్లింలు ఉగ్రవాదులు అంటూ పవన్ చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలను ఆ సామాజిక వర్గం యువత సీరియస్‌గా తీసుకున్నది. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ముస్లిం యువకులు (Muslim Youth) ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని యువత మండిపడుతున్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ఫ్‌ను పవన్ కల్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని, ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఖాజా పోలీసులను కోరారు. ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని శాంతి, ప్రేమకు సంబంధించిన మతమని ఖాజా వ్యాఖ్యానించారు. కాగా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత లేదు. అయితే ఇటీవల ఉగ్రవాదం వేరు, శాంతి భద్రతలు కోరుకునే ముస్లిం సమాజం వేరు అనే విషయంపై స్పష్టత ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Read Also-Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో సమంత పోస్ట్.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా?
పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం
పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసిన ముస్లిం యువకులపై సేనాని అభిమానులు, జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. ‘ దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయి. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళు, లుంబిని పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ళు మర్చిపోయారా? పాకిస్థానీలకు, బంగ్లాదేశ్ రోహింగ్యాలకు పాతబస్తీ అడ్డాగా మారిన విషయం నిజం కాదా? ఇప్పుడు దేశంలో పరిస్థితుల దృష్ట్యా కొందరు సెక్యూలర్ జపం చేస్తున్నారు. మీ గతం మరిస్తే ఎలా? ఆ జిహాదీలు, ఉగ్రవాదులు, ముస్లింలు అయినందుకు సిగ్గుపడి వారికి వత్తాసు పలకడం మానుకోవాలి. అంతే తప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ పైన మీద ఏదో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఒరిగేది ఏముంది? ఇలాచేసి సాధించేది ఏముంది?’ అని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Read Also-YS Jagan: వైఎస్ జగన్ షాకింగ్ ప్రకటన.. ఆశ్చర్యపోయిన నేతలు!
చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకూ..
మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పవన్ సీరియస్ కామెంట్స్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా భారత సైన్యాన్ని కించపరచినా, దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిదని సేనాని హితవు పలికారు. అంతేకాదు ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే పాకిస్థాన్‌పై ప్రేమను చూపించే కాంగ్రెస్ నాయకులు దేశం విడిచిపోవాలంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని పాక్ ఉగ్రవాదులకు భారత్ బలంగా బుద్ధి చెప్పింది. పహల్గాం ఘటనలో హిందువులను అత్యంత దారుణంగా చంపారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతదేశం కోరుకుంది. పరేషన్ సింధూర్‌లో ఎక్కడా పాక్ ఆర్మీపై గానీ, పౌరులపై గానీ దాడి చేయలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు చేపట్టిన ప్రధాని మోదీకి, సైన్యానికి దేశం మొత్తం అండగా ఉంటుంది. చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి’ అని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.
Read Also- Hydra: నేడే హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..